పరంజాల నిర్మాణ పనులు షురూ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో నాలుగు గోపురాలు, దేవాలయాలకు పరంజా (కర్రలతో మెట్లు) నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. బుధవారం తమిళనాడులోని మహాబలిపురానికి చెందిన రవీంద్రన్ ఆధ్వర్యంలో 20 మంది సిబ్బందితో పనులు ప్రారంభించారు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం గోపురాలతో పాటు కాళేశ్వరముక్తీశ్వరస్వామి ప్రధాన ఆలయం, శుభానందదేవి, సరస్వతి అమ్మవార్ల ఆలయాల గోపురాలకు పరంజాల నిర్మాణం చేపడుతున్నారు. ఈ నిర్మాణం సుమారు 25 నుంచి 30 మంది సామర్థ్యంతో నిల్చుని పూజలు చేసేలాగా పనులు చేపట్టారు. నిర్మాణాలు వారంలోపు పూర్తి చేస్తామని రవీంద్రన్ పేర్కొన్నారు. కాగా పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతిచే కుంభాభిషేకం పూజలు చేపట్టనున్నారని తెలిసింది. అయితే వారి ఆహ్వానానికి దేవస్థానం అఽధికారులు (నేడు) గురువారం రాజమహేంద్రవరం వెళ్లనున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ బ్రేక్
ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో నిర్వహించే కుంభాభిషేకం ఆహ్వాన పత్రికకు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బ్రేక్ పడింది. దీంతో ఆహ్వాన పత్రికలో మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు వీఐపీల పేర్లు లేకుండా అధికారులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆహ్వాన పత్రికల ముద్రణ కూడా జరిగింది. వాటిస్థానంలో వాల్పోస్టర్లలో అధికారుల పేర్లతో మరోసారి ముద్రించి పంపిణీ చేయనున్నట్లు తెలిసింది.
ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో కుంభాభిషేకం
ఆహ్వాన పత్రికకు ఎమ్మెల్సీ ఎన్నికల బ్రేక్
Comments
Please login to add a commentAdd a comment