నిబంధనలు పాటించకుంటే ఆస్పత్రులు సీజ్
కాటారం: ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించకుంటే శాఖ పరమైన చర్యలతో పాటు ఆస్పత్రులు సీజ్ చేస్తామని జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి రవిరాథోడ్ హెచ్చరించారు. కలెక్టర్, డీఎంహెచ్ఓ ఆదేశాల మేరకు కాటారం మండల కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రుల నిర్వాహణ, వైద్య సేవలు, పరిశుభ్రత, మందుల స్టాక్ వివరాలు, ఆస్పత్రి నిర్వాహణ, లైసెన్స్లు, డాక్టర్ గుర్తింపు పత్రాలు, మౌలిక వసతులు పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య పరీక్షల ఫీజుల వసూలుపై ఆరా తీశారు. భార్గవి, శ్రీలక్ష్మి, ధర్మశాస్త్ర ఆస్పత్రులకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికెట్, బయో మెడికల్ వేస్టేజ్, ఫైర్ సేఫ్టీ మేనేజ్మెంట్ సర్టిఫికెట్లు ఉండాలన్నారు. రోగులకు అవసరం లేని వైద్యపరీక్షలు చేసి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయవద్దన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంట హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీదేవి, ఎంపీహెచ్ఈఓ మురళీధర్, హెల్త్ అసిస్టెంట్స్ సుధీర్, కాపర్తి రాజు, సమ్మయ్య, సిబ్బంది తదితరులు ఉన్నారు.
డిప్యూటీ డీఎంహెచ్ఓ రవిరాథోడ్
Comments
Please login to add a commentAdd a comment