సన్నరకాల సాగుకే రైతుల మొగ్గు | - | Sakshi
Sakshi News home page

సన్నరకాల సాగుకే రైతుల మొగ్గు

Published Thu, Jan 30 2025 1:56 AM | Last Updated on Thu, Jan 30 2025 1:56 AM

సన్నరకాల సాగుకే రైతుల మొగ్గు

సన్నరకాల సాగుకే రైతుల మొగ్గు

భూపాలపల్లి రూరల్‌: జిల్లాలో యాసంగి సాగు జోరందుకుంది. ఆరుతడి పంటలు వేసిన రైతులు వరి సాగు మొదలుపె ట్టారు. జిల్లాలోని గణపురం, భీం ఘనపూర్‌ సరస్సులతో పాటు చెరువులు, బోరు, బావుల్లో భూగర్భ జలా లు పుష్కలంగా ఉండటంతో ఈసారి రై తులు ఎక్కువగా వరి సాగుకే మొగ్గు చూ పుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం బోనస్‌ కూడా ఇస్తుండటంతో యాసంగిలోనూ సన్న రకా లను ఎక్కువగా సాగు చేస్తున్నారు. నవంబరు నెలా ఖరు వరకు నారుమడులు సిద్ధం చేసిన రైతులు ప్రస్తుతం వరినాట్లు వేస్తున్నారు. జిల్లాలోని రైతులు ఒకేసారి వరినాట్లను మొదలు పెట్టడంతో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగింది. వాతావరణం చల్లబడినా.. బోర్లను ఎక్కువగా వినియోగిస్తుండటంతో వ్యవసాయ విద్యుత్‌కు డిమాండ్‌ ఎక్కువైంది. యాసంగిలో ఎండలు ముదరక ముందే పంటలు చేతికి వచ్చే విధంగా రైతులు ముందస్తుగా సాగును చేస్తున్నారు.

1,06,794 ఎకరాల్లో సాగుకు అంచనా..

ఈ సీజన్లో 1,06,794 వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 89,200 ఎకరాల్లో వరి సాగు అంచనా వేయగా ఇప్పటికే 52,750 వేల ఎకరాల్లో పంట సాగైంది. జిల్లాలో సాగయ్యే మొత్తం విస్తీర్ణంలో 90 శాతానికి పైగా వరి సాగు చేస్తారని ముందస్తుగానే అధికారుల అంచనాకు వచ్చారు. గణపురం, భీం ఘన్‌పూర్‌ సరస్సుల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో పాటు భూగర్భ జలాలు కూడా ఎక్కువగా ఉండటంతో రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తున్నారు. పైగా ప్రభుత్వం సన్న రకాలకు బోనస్‌ క్వింటాకు రూ.500 ఇవ్వనుండటంతో యాసంగిలోనూ సన్న రకాలనే సాగు చేస్తున్నారు. అలాగే మొక్కజొన్న 17,500 ఎకరాలు తదితర పంటలు సాగు చేశారు. వీటితో పాటు కూరగాయల పంటలను కూడా రైతులు వేశారు.

మొగుళ్లపల్లిలో నాటు వేస్తున్న కూలీలు

జిల్లాలో యాసంగి సాగు వివరాలు (ఎకరాల్లో)

పంటలు అంచనా ఇప్పటి వరకు సాగు

వరి 89,200 52,750

మొక్కజొన్న 17,500 10,125

ఇతర పంటలు 94 94

మరింత పెరగనున్న విద్యుత్‌ వినియోగం

చెరువులు, బోరు, బావుల్లో పుష్కలంగా నీరు

జిల్లాలో 89,200

ఎకరాల్లో వరి సాగు అంచనా

కూలీల కొరత...

ట్రాక్టర్ల ద్వారా పొలాలను దున్నేందుకు అధిక మొత్తంలో డబ్బులు వెచ్చిస్తున్నారు. దీనికితోడు స్థానికంగా కూలీలు దొరకకపోవడంతో ఇతర గ్రామాల నుంచి వచ్చిన కూలీల ద్వారా ఎకరాకు రూ.4,500–5,000 వరకు వెచ్చిస్తున్నారు. ముందస్తుగా వరి నాట్లు వేస్తే ఏప్రిల్‌, మే నెలలో పంట చేతికివచ్చే అవకాశం ఉంది. ప్రతీ సంవత్సరం మార్చి చివరివారం నుంచి ఏప్రిల్‌ రెండో వారంలో అకాల వర్షాలు కురుస్తుండటంతో ఆలోగా పంట పూర్తయ్యేలా రైతులు వరినాట్లు వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement