రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
ములుగు: వాహనదారులు రోడ్డు భద్రతా నియమాల ను తప్పనిసరిగా పాటించా లని ములుగు ఓఎస్డీ మహే శ్ గీతే, డీఎస్పీ రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ పంక్షన్ హాల్లో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం ములుగు పోలీస్ శాఖ, రోడ్డు ట్రాన్స్పొర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు అవగాహన కార్య క్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ములుగు ఓఎస్డీ మహేశ్ గీతే మాట్లాడుతూ.. వాహనదారులు తప్పకుండా రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. వారిపై వారి కుటుంబం ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ములుగు జిల్లాలో చాలా వరకు జరిగిన రహదారి ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం, రాంగ్ రూట్లో రావడం, తాగి వాహనాలను నడపడం కారణంగానే జరిగాయన్నారు. కాబట్టి వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక డ్రైవ్ చేసి రోడ్డు భద్రత నియమాలను పాటించని వారిపై చట్ట ప్రకారంగా కఠిన చర్యలను తీసుకుంటామని చెప్పారు. సుమారుగా 300 మంది వాహనదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, సీఐ శంకర్, ఆర్టీఓ శ్రీనివాస్, ఎస్సై వెంకటేశ్వరావు, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment