రైతులకు సకాలంలో ధాన్యం డబ్బులు ఇవ్వాలి | Sakshi
Sakshi News home page

రైతులకు సకాలంలో ధాన్యం డబ్బులు ఇవ్వాలి

Published Thu, May 23 2024 4:35 AM

-

గద్వాల అర్బన్‌: ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే ప్రైవేటు వ్యాపారులు విచ్చలవిడిగా రైతులను దోచుకుంటున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అన్నారు. బుధవారం గద్వాల మండలంలోని లత్తీపురం, బీరేల్లీ, బస్సల్‌ చేరువు తదితర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. రైతుల నుంచి కొనుగోలు చేసి ధాన్యానికి ప్రభుత్వం 45నుంచి 50శాతం రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వలేదన్నారు. కోనుగోలు కేంద్రాలు దగ్గర క్వింటాకు 4కేజీల తరుగు తీయడం, గన్ని బ్యాగుల కొరత, వడ్లు కాంట, తూకం వేసిన తర్వాత మిల్లులకు తరలించే వరకు రైతులు పడిగాపులు కాయడం, హమాలీ చార్జీలు తదితర విధానాల వల్ల రైతులు ధాన్యం ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారని తెలిపారు. తద్వారా రాష్ట్రానికి సంబంధించిన దాన్యం ఏపీ, కర్ణాక వంటి రాష్ట్రలకు వెళ్తుతుందన్నారు. ప్రభు త్వం పంట డబ్బులు వేయాలన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement