నేడు జోగుళాంబ ఆలయంలో పూజలకు విరామం | - | Sakshi
Sakshi News home page

నేడు జోగుళాంబ ఆలయంలో పూజలకు విరామం

Published Tue, Jan 28 2025 1:09 AM | Last Updated on Tue, Jan 28 2025 1:09 AM

నేడు

నేడు జోగుళాంబ ఆలయంలో పూజలకు విరామం

అలంపూర్‌: అలంపూర్‌ జోగుళాంబ అమ్మవారి ఆలయంలో ఈ నెల 28వ తేదీన పూజలకు తాత్కాలిక విరామం ఉంటుందని ఆలయ ఈఓ పురేందర్‌ కుమార్‌, ఆలయ పాలక మండలి చైర్మన్‌ నాగేశ్వర్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జోగుళాంబ అమ్మవారి ఆలయంలో వార్శిక బ్రహ్మోత్సవాలు జరగనుండగా.. ఈ నెల 28వ తేదీ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంతో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పూజలకు తాత్కాలిక విరామం ఉంటుందని, ఆలయ తలుపులు మూసివేయడంతో భక్తులకు లోపలికి అనుమతి ఉండదని తెలిపారు. తిరిగి సాయంత్రం 6.30 గంటల నుంచి భక్తులను అనుమతించడం జరుగుతుందని, ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

డీఎస్పీ ప్రత్యేక పూజలు

జోగుళాంబ క్షేత్రాన్ని గద్వాల డీఎస్పీ మొగులయ్య కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్‌ శర్మ వారికి సాదర స్వాగతం పలికారు. అనంతరం డీఎస్పీ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక స్వాములు వారికి తీర్ధ ప్రసాదాలను అందజేసి అశీర్వచనం పలికారు. ఆలయ అధికారులు శేషవస్త్రాలతో సత్కరించారు. వీరితోపాటు స్థానిక ఎస్‌ఐ వెంకటస్వామి తదితరులు ఉన్నారు.

మాకొద్దు

ఈ ఉపాధ్యాయుడు..

ఎర్రవల్లి: సమయపాలన పాటించకపోవడంతోపాటు విద్యార్థులకు సరైన బోధన చేయని ఉపాధ్యాయుడు మాకొద్దు అంటూ మండలంలోని జింకలపల్లి గ్రామస్తులు ఎంఈఓ అమీర్‌ భాషకు ఫిర్యాదు చేశారు. సాధారణ తనిఖీలో భాగంగా ఏంఈఓ సోమవారం ఉదయం జింకలపల్లిలోని ప్రాథమిక పాఠశాలను చేరుకున్నారు. అయితే, పాఠశాల ఉపాధ్యాయుడు ఉమేశ్వరయ్య పాఠశాలకు సమయానికి చేరుకోలేదు. పాఠశాలలో 30మంది విద్యార్థులుండగా ఒకే ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు విధులకు సక్రమంగా రాకపోవడంతో విద్యార్థుల చదువులు సాగట్లేదని తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు. విధులకు సరిగా హాజరుకాకపోవడంతోపాటు విద్యార్థులను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఉపాద్యాయుడిని తక్షణమే విధుల నుండి తొలగించాలని ఎంఈఓకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి ఉపాధ్యాయుడిపై తగు చర్యలు తీసుకుంటామని ఎంఈఓ తెలిపారు.

కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను వెంటనే క్రమబద్ధీకరించాలని పీయూ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు రవికుమార్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన పీయూలో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను వెంటనే క్రమబద్ధీకరించి తర్వాత నోటిఫికేషన్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. క్రమబద్ధీకరణ ఆలస్యం అయితే అధ్యాపకులకు బేసిక్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌, ఉద్యోగ భద్రత వంటివి కల్పించాలన్నారు. యూనివర్సిటీలో ఉన్న సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులను రెగ్యులర్‌ కోర్సులుగా మార్చాలని, పోస్టులు మంజూరు చేసి వేతనం ప్రభుత్వవమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నాయకులు అర్జున్‌కుమార్‌, కరుణాకర్‌రెడ్డి, విజయ్‌భాస్కర్‌, ఈశ్వర్‌కుమార్‌, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నేడు జోగుళాంబ ఆలయంలో పూజలకు విరామం 
1
1/1

నేడు జోగుళాంబ ఆలయంలో పూజలకు విరామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement