నారాయణపేట/మద్దూర్: ధాన్యాన్ని పక్కదారి పట్టించిన ఘటనలో సదరు రైస్ మిల్లు యజమాని రూ.14 కోట్లు కట్టాల్సిందేనని ఆదేశాలు జారీ చేయడంతోపాటు మద్దూరు పీఎస్‌లో సోమవారం ఫిర్యాదు చేయడంతో కేసు సైతం నమోదు అయ్యింది. వివరాలిలా.. మద్దూర్ మండలంలోని రెనివట్ల గ్రామంలోని బాల్‌రెడ్డి రైస్ మిల్లుపై స్టేట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందం ఇటీవల దాడులు నిర్వహించి 1.04 లక్షల ధాన్యం బస్తాలు మాయమైనట్లు గుర్తించింది. రూ.10.50 కోట్లు మూడు రోజుల్లో కట్టాలని గడువు ఇవ్వగా.. కేవలం రూ.10 లక్షలు మాత్రమే చెల్లించారని అధికారులు పేర్కొన్నారు. గడువు సైతం ముగియడంతో రాష్ట్ర సివిల్ సప్లయ్ అధికారుల ఆదేశాల మేరకు నారాయణపేట సివిల్‌సప్లయ్ ఇన్‌చార్జ్ డీఎం సైదులు మద్దూర్ పీఎస్‌లో ధాన్యం విలువ రూ.10.50 కోట్లు, 25 శాతం ఫైన్, 12 శాతం వడ్డీతో సహా రూ.14కోట్లు చెల్లించాల్సిందేనంటూ ఫిర్యాదు చేశారు. ఈమేరకు బాల్‌రెడ్డి మిల్లు యాజమాని కర్ణాటకర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాంలాల్ తెలిపారు. అతని వ్యక్తిగత ఆస్తులు జప్తు చేసి రికవరీ చేయడం జరుగుతుందని అధికారులు చెప్పుకొచ్చారు.
ధాన్యం పక్కదారి పట్టించిన
కేసులో మిల్లు యజమానిపై కేసు
Comments
Please login to add a commentAdd a comment