ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు సమస్యలపై 55మంది ఫిర్యాదు చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చిన వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపినట్లు వాటిని వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్‌నాలెడ్డ్‌మెంట్ ద్వారా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
‘చేనేత చేయూత’లో
రూ.80లక్షల వరకు అవినీతి..
కార్మికుల సంక్షేమభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన నేతన్నకు చేయూత పథకంలో రూ.80లక్షల వరకు అవినీతి జరిగినట్లు ప్రియదర్శిని మహిళా చేనేత సహకార సంఘం అధ్యక్షురాలు సత్యమ్మ ఆధ్వర్యంలో కార్మికులు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అవినీతిపై పూర్తిస్థాయి విచారణ జరిపి అవినీతికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 7 వినతులు
గద్వాల క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 7 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వీటిలో భూ సంబంధ, స్థల ఆక్రమణ ఫిర్యాదులు అందాయని, మిగతా సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాల్సిందిగా ఎస్పీ బాధితులకు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment