కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోండి
అయిజ: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంది కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ దొడ్డెప్ప అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సబ్ యార్డ్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డితో కలిసి కందుల కొనగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం దొడ్డెప్ప మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 7,550 కనీస మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తామని అన్నారు. కొనుగోలు కేంద్రానికి కందులు తెచ్చే రైతులు సంబంధిత ఏఈఓతో పంట ధ్రువీకరణ పత్రం, పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్‌లను తీసుకురావాలని కోరారు. తేమశాతం 12 లోపు ఉండాలని, ధాన్యంలో చెత్తా చెదారం లేకుండా శుభ్రంచేసుకొని రావాలని సూచించారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ గౌరీ నాగేశ్వర్, సింగిల్‌విండో కార్యదర్శి మల్లేష్, సిబ్బంది జీవన్, శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment