పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి
గద్వాలటౌన్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏకీకృత పింఛన్ స్కీంను వ్యతిరేకిస్తూ పీఆర్టీయూ నాయకులు జిల్లా వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. సోమవారం పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అన్ని మండలాల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ మాజీ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం సీపీఎస్‌కు బదులు ఏకీకృత పింఛన్ స్కీంను తీసుకొస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ పాత పింఛన్‌ను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ మల్లికార్జున్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు ఈదన్న, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment