ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
అలంపూర్: ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. కర్నూల్‌లోని ఎమ్మెల్సీ నివాసంలో సీఎం సహాయ నిధి చెక్కులను గురువారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే విజయుడు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వార మంజూరైన చెక్కులను అందజేశారు. మానవపాడు మండలం అమరవాయి గ్రామానికి చెందిన నర్సన్‌గౌడుకు సీఎం సహాయ నిధి ద్వార రూ.13500, రాజోలికి చెందిన నగేష్‌కు సీఎం సహాయ నిధి ద్వారా రూ.12 వేల సీఎం సహాయ నిధి చెక్కు వచ్చినట్లు తెలిపారు. వైద్య ఖర్చుల నిమిత్తం దరఖాస్తు చేసుకోగా సీఎం సహాయ నిధి నిధులు మంజూరైనట్లు తెలిపారు. వీరితోపాటు నాయకులు పరమేశ్వర్ రెడ్డి, కిషోర్, నాగేశ్వరరావు, షబ్బీర్, శేఖర్, శ్రీహరి తదితరులు ఉన్నారు. ఇదిలాఉండగా, అయిజ మండలం తొత్తినోనిదొడ్డిలోని గుండ్ల భీమరాయ స్వామివారి జాతర ఫిబ్రవరి 2న నిర్వహించనున్నట్లు, వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకు ఆహ్వానం పలికినట్లు సంకాపురం రాముడు, గ్రామ నాయకులు వావిలాల రంగారెడ్డి, అశోక్ రెడ్డి, ఉమేష్ గౌడు, వై. రాముడు తదితరులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment