అంబేడ్కర్ ఆశయాలు ఆచరణలోకి రావాలి
ధరూరు: అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు అందాలనే ఉద్ధేశ్యంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారని, ఆయన ఆశయాలు ఆచరణలోకి రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిదిలోని పెద్దపాడులోని నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. గ్రామాల్లో ప్రజలందరూ కలిసికట్టుగా ఉన్నప్పుడే గ్రామం అభివృద్ది చెందుతుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కేట్ యార్డ్ చైర్మన్ హనుమంతు, రమేష్ నాయుడు, విజయ్ బాస్కర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment