వేరుశనగ క్వింటాల్ రూ.6 వేలు
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు గురువారం 1618 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6000, కనిష్టం రూ.2019, సరాసరి రూ.5469 ధరలు పలికాయి. అలాగే, 2 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 5459 ధర లభించింది. 164 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.6779, కనిష్టం రూ. 3019, సరాసరి రూ. 6669 ధరలు వచ్చాయి. 9 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 1759 ధర లభించింది.
పోలీసుశాఖకు
అదనపు అదాయం
గద్వాల క్రైం: వివిధ కేసుల్లో పట్టుబడి (స్క్రాప్)న 73 వాహనాలను గురువారం ఉదయం జిల్లా పరేడ్ గ్రౌండ్లో బహిరంగ వేలం ద్వారా విక్రయించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ వేలం పాటలో 30 మంది పాల్గొనగా.. హైద్రాబాద్‌కు చెందిన వ్యాపారి రూ.3.46 లక్షలకు దక్కించుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
అందుబాటులో ఉంటూ సేవలందించాలి
గద్వాల: ఐదేళ్లు పట్టణ ప్రజలకు పరిపాలనను అందించి ఇటీవల పదవి కాలం ముగించుకున్న తాజా మాజీలు అయిన గద్వాల మాజీ మున్సిపల్ చెర్మన్ బీఎస్ కేశవ్, మాజీ కౌన్సిలర్లను గురువారం జెడ్పీ మాజీ చైర్పర్సన్ కె.సరిత సన్మానించారు. ఐదేళ్లు పట్టణప్రజలకు జవాబుదారితనంతో బాధ్యతలు నిర్వర్తించి సేవలందించి గద్వాల పట్టణాన్ని అభివృద్ధి చేశారన్నారు. పదవీకాలం ముగిసి మాజీలు అయినప్పటికీ మున్ముందు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సేవాలందించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇసాక్, మదుసుదన్బాబు, కృష్ణారెడ్డి, మాణిక్యమ్మ, శారద, జయమ్మ, వసీమబేగం తదితరులు పాల్గొన్నారు.
కుష్టు రహిత
సమాజమే లక్ష్యం
గద్వాల క్రైం: కుష్టు వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి సిద్దప్ప అన్నారు. గురువారం జిల్లా వైద్యాశాఖ కార్యాలయంలో మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో వైద్యాధికారులు ఇంటింటి సర్వే చేపట్టి ఆరోగ్య అంశాలపై ప్రజలకు వివరించాలన్నారు. అనుమానిత వ్యక్తుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో ఇంటి పరిసరాలను ప్రజలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు. అత్యవసర చికిత్సల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం కుష్టు నివారణపై సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంల్లో కుష్ఠు వ్యాధి నివారణపై అవగహన కార్యాక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు ఉన్నారు.
బాలికలు
అన్ని రంగాల్లో రాణించాలి
కేటీదొడ్డి: బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని, అందరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ప్రియాంక అన్నారు. గురవారం మండలంలోని పాతపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె బాల్య వివాహలు వలన కలిగే నష్టాలు, విద్యా ప్రాముఖ్యత గురించి తెలిపారు. కార్యక్రమంలో డిసీపీఓ నరసింహ, చిట్టెమ్మ, శివలీల, కృష్ణ, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment