మరికొన్ని గంటల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఉమ్మడిపాలమూరు జిల్లాకు అవసరమైన కేటాయింపులు దక్కాలని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడాల్సి ఉంది. ప్రజారవాణా, అభివృద్ధికి రైల్వే సదుపాయం కీలకం కాగా.. ప్రతిసారి కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితం అవుతుంది. ఇందుకోసం అవసరమైన నిధుల కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. కొత్తగా ప్రతిపాదించిన రైల్వేలైన్లకు నిధులు కేటాయించాలని ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు డీకే అరుణ, మల్లురవి ఇప్పటికే కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నాలుగున్నర దశాబ్దాలుగా ఊరిస్తున్న గద్వాల–మాచర్ల రైల్వేలైన్కు మోక్షం కలుగుతుందా.. లేక ఆనవాయితీగా కొద్దిపాటి కూతలకే పరిమితమవుతుందా అనే విషయం శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్తో తేలనుంది.
– సాక్షి, నాగర్కర్నూల్
Comments
Please login to add a commentAdd a comment