మహాత్మాగాంధీ ఆశయాలు కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

మహాత్మాగాంధీ ఆశయాలు కొనసాగించాలి

Published Fri, Jan 31 2025 1:05 AM | Last Updated on Fri, Jan 31 2025 1:05 AM

మహాత్మాగాంధీ ఆశయాలు కొనసాగించాలి

మహాత్మాగాంధీ ఆశయాలు కొనసాగించాలి

గద్వాల: మహాత్మాగాంధీ ఆశయాల మేరకు ప్రతిఒక్కరు కుష్టువ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. గురువారం మహాత్మాగాంధీ వర్ధంతి, అమరవీరుల స్మారక దినోత్సవంలో భాగంగా కలెక్టరేట్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ముందుగా అధికారులతో కలిసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుష్టు వ్యాధిగ్రస్తులపై వివక్ష లేకుండా ప్రేమతో సేవచేయాలని సమాజంలో ఈ వ్యాధిపై అపోహలను తొలగించి అవగాహన కల్పించాలన్నారు. ఈసందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. ఎవరికై నా చర్మంపై స్పర్శ కోల్పోయి మచ్చలు కలిగి ఉంటే, వాటిని తాకినప్పుడు నొప్పి కలగనప్పుడు దానిని కుష్ఠు వ్యాధిగా అనుమానించాలని దాని కోసం అవసరమైన వైద్యపరీక్షలు చేసుకుని అందుకనుగుణంగా వైద్యచికిత్స తీసుకోవాలన్నారు. ఈవ్యాధి కారణంగా అంగవైకల్యం ఏర్పడిన వ్యక్తుల పట్ల శ్రద్ధవహించి వారికి అవసరమైన వైద్యచికిత్స అందించేలా ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ వ్యాధి పూర్తిగా నయం చేయదగినదని దీనిని నిర్లక్ష్యం చేయరాదన్నారు. మహాత్మాగాంధీ కలలు కన్న విధంగా భవిష్యత్తులో కుష్ఠు వ్యాధి రహిత భారతదేశ నిర్మాణానికి ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సిద్దప్ప, ఏవో వీరభద్రప్ప, వివిధ శాఖలకు చెందిన అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

త్యాగాలు మరువలేనివి

గద్వాల క్రైం: స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు మరువలేనివని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో అమరవీరుల దినోత్సవం సందర్భంగా సిబ్బంది వారి త్యాగాలను స్మరించుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. బానిస సంకేళ్ల నుంచి విముక్తి కోసం ఆంగ్లేయులపై వీరోచిత పోరాటం చేశారన్నారు. వారి త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామని, బావితరాలకు ఈ విషయాలు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement