సింధేను పరిచయం చేస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, నిజామాబాద్/కామారెడ్డి: 'ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. జుక్కల్, బాన్సువాడలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలలో పాల్గొన్న ఆయన.. తొమ్మిదిన్నరేళ్లలో చేసిన అభివృద్ధిని వివరించారు. ఓవైపు సంక్షేమ పథకాలను వివరిస్తూనే.. మరోవైపు ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. మరోసారి బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. సభలకు జనం భారీగా తరలిరావడం, పోచారం, సింధేలపై సీఎం కేసీఆర్ పొగడ్తల వర్షం కురిపించడంతో గులాబీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.'
అన్ని పార్టీలకంటే ముందే అభ్యర్థులను ప్రకటించి, బీ ఫామ్‌లూ ఇచ్చిన బీఆర్‌ఎస్.. నియోజకవర్గాలవారీగా సభలతో ప్రచారంలోనూ ముందుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం జిల్లాలో రెండు నియోజకవర్గాలలో నిర్వహించిన సభలలో పాల్గొన్నారు. తన ప్రసంగంతో కార్యకర్తల్లో జోష్ నింపారు. పోరాటాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లేందుకు మూడు నెలల పాటు ఆర్థిక వేత్తలతో మేధోమధనం చేశామని సీఎం పేర్కొన్నారు.
ఎన్నో ఆలోచనలు చేసి రూపొందించిన పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసి దేశానికి దిక్సూచిగా నిలిచామన్నారు. మన దగ్గర ఉన్న పథకాలు ప్రధానమంత్రి మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ లేవన్న విషయాన్ని గుర్తించాలని ప్రజలను కోరారు. ఇప్పటికే మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులు, 24 గంటల విద్యుత్, తాగునీరు, పంట రుణాల మాఫీ, రైతుబంధు, రైతు బీమా వంటి సంక్షేమ కార్యక్రమాలతో దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు.
ప్రభు త్వం అమలు చేసిన పథకాలతో పేదల దుఃఖం తీరిందని, వ్యవసాయంలో లక్ష్మి తాండవిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఆ పార్టీ చేసిన ద్రోహం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమైందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పా లిత రాష్ట్రాలలో ఎక్కడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదన్నారు. పొరపాటున కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే నిండా ముంచుతారన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, ఇంకా ప్రజల అవసరాలను తీర్చే ప్రయ త్నం చేస్తామని పేర్కొన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేలు సౌమ్యులు..
వెనుకబడిన ప్రాంతమైన జుక్కల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన స్థానిక ఎమ్మెల్యే హన్మంత్ సింధే నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నాడని సీఎం కేసీఆర్ అభినందించారు. తన దగ్గరకు ఎ ప్పుడు వచ్చినా వెనుకబడిన ప్రాంతమంటూ నిధులు తీసుకువెళ్లడమే త ప్ప సొంత పనుల గురించి ఎప్పుడూ అడగలేదన్నారు. ఎన్నికల తర్వా త వచ్చి లెండి ప్రాజెక్టు గురించి మహారాష్ట్ర వాళ్లను పిలిచి మాట్లాడతానని, నాగమడుగుతో నలభై వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు.
గతంలో సింగూరు నీళ్లు రాకుంటే ఇబ్బంది ఉండేదని, ఇప్పుడు దాని అవసరం లేకుండానే నిజాంసాగర్ నిండుకుండలా ఉండే పరిస్థితి వచ్చిందన్నారు. జుక్కల్ ప్రాంతానికి అప్ప ట్లో పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదన్నారు. తెలంగాణ వచ్చాక అభివృద్ధి జరిగి పరిస్థితి మారిందన్నారు. గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరో తెలిసేది కాదని, మనం అధికారంలోకి వచ్చాక నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదే ప్రాంతానికి చెందిన ఎంపీ బీబీ పాటిల్ కేంద్రంతో కొట్లాడి ఎన్నో రోడ్లు సా ధించాడన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరూ సౌమ్యు లని సీఎం అభినందించారు.
పదేళ్లలోనే ఎంతో అభివృద్ధి..
సీఎం కేసీఆర్ కృషితో 60 ఏళ్లలో జరగని అభివృద్ధి పదేళ్లలోనే జరిగిందని జుక్కల్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ అ భ్యర్థి హన్మంత్ సింధే పేర్కొన్నారు. సోమవా రం జుక్కల్ చౌరస్తా వద్ద నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో రూ. 5,500 కోట్లతో అభివృద్ధి పనులు చే శామన్నారు. రూ. 1,500 కోట్లతో రోడ్లు, వంతెన లు నిర్మించామన్నారు. నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మూడు మండలాల్లో 30 పడకల ఆస్పత్రులతోపాటు బిచ్కుందలో 100 పడకల ఆస్పత్రి నిర్మించా మన్నారు.
పిట్లంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, నిజాంసాగర్, కౌలాస్ ప్రాజెక్టులు, కౌలాస్ కోటలను పర్యాటకంగా అభివృద్ధి చేయా లని, పోడు భూములు సాగు చే స్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని సీఎంను కోరారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత పోచారం శ్రీనివాస్‌రెడ్డి నాయకత్వంలో బాన్సువాడ నియోజక వర్గం ఎంతో అభివృద్ధి సాధించిందని సీఎం కేసీఆర్ అన్నారు. తన నియోజకవర్గంలో కూడా కట్టలేనన్ని ఇళ్లు పోచారం శ్రీనన్న నిర్మించి ఆదర్శంగా నిలిచాడన్నారు. బాన్సువాడ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది బంగారువాడగా మారిందన్నారు.
పోచారం వ్యవసాయ మంత్రిగా ఉన్నపుడు రైతుబంధు పథకం తీసుకువచ్చి అమలు చేశామని, ఆయనను అందుకే తాను లక్ష్మీపుత్రుడు అని సంబోధిస్తానని పేర్కొన్నారు. ఇంత అభివృద్ధి చేసిన లక్ష్మీపుత్రుడిని లక్ష మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పోచారం గొప్ప హోదాలో ఉంటాడన్నారు. ముస్లిం పిల్లల చదువుల కోసం గురుకులాలు ఏర్పాటు చేశామని, జూనియర్ కాలేజీలుగా అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పోచారం శ్రీనన్న కోరిన కోరికలన్నీ చేసిపెడతానని, ఆయనను మాత్రం భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఇవి చదవండి: ఎంపీపై దాడి అప్రజాస్వామికం! : ఎమ్మెల్యే మాణిక్‌రావు
Comments
Please login to add a commentAdd a comment