ఎండీఎం ఏజెన్సీ తొలగింపు
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మధ్యాహ్న భోజన పథకం(ఎండీఎం) ఏజెన్సీని తొలగించినట్లు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బియ్యం, వంట సామగ్రిని ఆయన పరిశీలించారు. అనంతరం ఫుడ్ పాయిజన్ కావడంతో అనారోగ్యానికి గురైన విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఫుడ్ ఇన్స్పెక్టర్లతో మాట్లాడి ఫుడ్ పాయిజన్ కావడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఎండీఎం ఏజెన్సీ తప్పిదం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తేలడంతో వెంటనే ఎండీఎం ఏజెన్సీని తొలగించి కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ఎంఈవో వెంకటేశంను ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఈవో బలరాం, ఆర్డీవో మన్నె ప్రభాకర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ శిరీష, ఇన్చార్జి తహసీల్దార్ చరణ్‌సింగ్ పాల్గొన్నారు.
ప్రధానోపాధ్యాయుడిపై వేటు
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాణిక్యంను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారని ఇన్చార్జి డీఈవో బలరాం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం విషయంలో హెచ్ఎం సరైన పర్యవేక్షణ చేయకపోవడం వల్లే 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని భావిస్తూ విచారణ అనంతరం ఈ చర్య తీసుకున్నారని పేర్కొన్నారు.
బల్దియా ప్రత్యేకాధికారిగా..
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ప్రత్యేకాధికారిగా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment