మాఘమాసం.. మంచి ముహూర్తం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఏటా మాఘమాసం శుభ ముహూర్తాలను మోసుకొని వస్తుంది. ఈ సారి కూడా మంచి ముహూర్తాలు ఉండడంతో వివాహాలు పెద్ద సంఖ్యలో జరగనున్నాయి. ఇ ప్పటికే పెళ్లి సంబంధాలు మాట్లాడుకుని ము హూర్తాలు నిర్ణయించుకున్నవారు ఏర్పాట్లలో ని మగ్నమయ్యారు. మాఘమాసంలో ఫిబ్రవరిలో 2, 3, 7, 8, 13, 16, 20, 23 తేదీలతోపాటు మార్చి 2, 6 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నా యని వేద పండితుడు జయరాం శర్మ ‘సాక్షి’తో తెలిపారు. శుభ ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లతో పాటు నూతన గృహ ప్రవేశాలు పెద్ద సంఖ్యలో జరగనున్నాయి. ఈ మాసంలో జిల్లాలో వేలాది వివాహాలు జరుగుతాయని భావిస్తున్నా రు. ముందుగానే పెళ్లి సంబంధాలు ఖాయం చేసుకున్నవారు ఇప్పటికే ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్, మేళతాళాలు, ఫొటో, వీడియోగ్రాఫర్లను మాట్లాడి పెట్టుకున్నారు. పెళ్లిళ్లకు సమయం ద గ్గర పడుతుండడంతో వస్త్రాలు, బంగారం, ఫ ర్నిచర్, వంట పాత్రలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో దుకాణాలన్నీ కళకళలాడుతున్నాయి.
2 నుంచి వరుసగా శుభకార్యాలు
వేల సంఖ్యలో జరగనున్న వివాహాలు
Comments
Please login to add a commentAdd a comment