కామారెడ్డి క్రైం : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాల ర్పించిన త్యాగమూర్తులను స్మరించుకుంటూ గురువారం అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. కలెక్టరేట్‌లో గాంధీజీకి ఘన నివాళులు అ ర్పించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని గాంధీజీతోపాటు స్వాతంత్య్ర ఉద్యమంలో అమరులైనవారికి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఏవో మసూ ర్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో..
దేశ స్వాతంత్య్ర పోరాటంలో అమరులైన వారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment