టమాట ధర ఢమాల్
రాజంపేట : మార్కెట్లో టమాట ధర ఒక్కసారిగా పడిపోడవండతో రైతులు దిగులు చెందుతున్నారు. రాజంపేట చుట్టు పక్కల గ్రామాలైన శివాయిపల్లి, పెద్దాయిపల్లి, బస్వన్నపల్లి, కోటాల్‌పల్లి గ్రామాలు కూరగాయల సాగుకు పెట్టింది పేరు. అయితే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి టమాట సాగు చేసిన ధర లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
అమ్ముడుపోని టమాట
కామారెడ్డి మార్కెట్ బీట్‌లో ఒకప్పుడు బాక్సు ట మాట ధర రూ.400 నుంచి రూ.500 పలకగా.. ప్రస్తుతం రూ.80 మాత్రమే పలుకుతోందని రైతులు వాపోతున్నారు. మరోవైపు చిరువ్యాపారులు రూ.10కి రెండు కిలోల చొప్పున అమ్మాల్సిన పరిస్థితి ఉంది. రాజంపేటలో బుధవారం సాయంత్రం టమాట అమ్ముడుపోకపోవడంతో కొందరు రైతులు రోడ్డుపై పారబోసి వెళ్లిపోయారు.
చేతికిరాని పెట్టుబడి
శివాయిపల్లిలో ఓ రైతు రూ.20 వేలు ఖుర్చు చేసి 15 గుంటల భూమిలో టమాట సాగు చేశాడు. ధర పడిపోవడంతో పెట్టిన పెట్టుబడి చేతికి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. టమాట తెంపకుండా అలాగే వదిలేస్తున్నామని కొందరు రైతులు ‘సాక్షి’తో తెలిపారు.
నష్టపోతున్నాం
వేలు ఖర్చు చేసి టమాట సాగు చేస్తే ప్రస్తుతం ధర లేక పోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. కామారెడ్డి మార్కెట్‌కు తరలిద్దామంటే రవాణా ఖర్చులు మీద పడుతున్నాయి. ధర లేక అన్ని రకాలుగా నష్టపోతున్నాం.
– జిల్లెల హేమంత్‌రెడ్డి, రైతు
బాక్సు ధర రూ.80 మాత్రమే..
ఎన్నో ఆశలతో సాగు చేసిన రైతులు
పెట్టుబడి కూడా దక్కడం లేదని ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment