![ఎకరాక](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/07022025-kmy_tab-07_subgroupimage_1885681648_mr-1738872112-0.jpg.webp?itok=SsKnjnxA)
ఎకరాకు రూ.17 లక్షల పరిహారం
నిజాంసాగర్ (జుక్కల్) : నాగమడుగు ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.17 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. మండలంలోని వడ్డేపల్లి, జక్కాపూర్ గ్రామ శివారులో నాగమడుగు భూ నిర్వాసిత రైతులతో ఆమె గురువారం మాట్లాడారు. నాగమడుగు ఎత్తిపోతల పథకం పైప్‌లైన్లు , కరకట్ట పనులకు అవసరమైన భూములు ఇచ్చి నిర్మాణ పనులకు సహకరించాలని సూచించారు. ఆమె వెంట నిజాంసాగర్ తహసీల్దార్ భిక్షపతి, డిప్యూటీ తహసీల్దార్ నవీన్ తదితరులు ఉన్నారు.
సెస్ వసూలుకు
చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి అర్బన్ : గ్రంథాలయ సంస్థకు బకాయిపడిని లైబ్రరీ సెస్ వసూలు కోసం స్థానిక సంస్థలకు సమాచారం ఇవ్వాలని, వసూళ్ల కోసం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. సమావేశంలో వివిధ అంశాలపై మాట్లాడిన అనంతరం సంస్థ 2025 – 26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఆమోదించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు, డీఈవో ఎస్ రాజు, వయోజన విద్యాధికారి వెంకటేశ్వరరావు, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పరీక్షలంటే
భయం వీడాలి
ఎల్లారెడ్డి : విద్యార్థులు పరీక్షలంటే భయం వీడాలని, జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషన ర్ బలరాం అన్నారు. పట్టణంలోని జిల్లా పరి షత్ బాలికల ఉన్నత పాఠశాలలో గురువా రం పదో తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించారు. భయం లేకుండా సాధారణ ప రిస్థితుల్లో పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు. ఇష్టపడి చదివితే విజయం సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో ఎంఈ వో వెంకటేశం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు పాలు పితికే పోటీలు
పిట్లం(జుక్కల్) : మండలంలోని చిల్లర్గి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రైతులకు గురువారం పాలు పితికే పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి సంతోష్ మాట్లాడుతూ.. పరిశుభ్ర వాతావరణంలో సురక్షితమైన పాలు పితికే విధానాలపై అవగాహన కల్పించేందుకు రైతులకు నిర్వహించినట్లు పేర్కొన్నారు. పాలు పితికే సామర్థ్యం ఆధారంగా ముగ్గురు ఉత్తమ రైతులను ఎంపిక చేసి వారికి బహుమతులతోపాటు పాల డబ్బాలు, కాల్షియం బాటిళ్లు, నులిపురుగుల నివారణ మందులు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో గోపాల మిత్రలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
10న ట్రయథ్లన్ ఎంపిక
కామారెడ్డి అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లాస్థాయి యూత్, అండర్ – 14 ట్రయథ్లన్ (మూడు వివిధ క్రీడలు) ఎంపికలు ఉంటాయని అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం జైపాల్‌రెడ్డి, కేపీ అనిల్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రయథ్లన్ యూత్ విభాగంలో అండర్ – 20, 18, 16, బాలురు, బాలికల విభాగంలో అండర్ – 14లో ఏ, బీ, సి గ్రూప్‌లు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి పాఠశాల నుంచి ఒక్కో విభాగంలో ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు తమ పుట్టిన తేదీ ధ్రువీకరణ లేదా ఎస్సెస్సీ మెమో జిరాక్స్ కాపీతో హాజరుకావాలని సూచించారు.
![ఎకరాకు రూ.17 లక్షల పరిహారం
1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06jkl102f-250025_mr-1738872112-1.jpg)
ఎకరాకు రూ.17 లక్షల పరిహారం
![ఎకరాకు రూ.17 లక్షల పరిహారం
2](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06ylr102-250055_mr-1738872112-2.jpg)
ఎకరాకు రూ.17 లక్షల పరిహారం
Comments
Please login to add a commentAdd a comment