![536 పంచాయతీలు.. 4,696 వార్డులు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/070225_mr-1738872112-0.jpg.webp?itok=jW1GWzPW)
536 పంచాయతీలు.. 4,696 వార్డులు
ఎన్నికల పనుల్లో అధికారులు బిజీగా మారారు. ఈనెల 27న పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీల పోలింగ్ జరగనుండగా, గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆయా శాఖల అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎక్కడ చూసినా ఎలక్షన్ మూడ్ కనిపిస్తోంది.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఓ వైపు పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు.. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం బిజీ అయ్యింది. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు జరిగేలా చూసుకోవడంలో అధికారులు బిజీ అయ్యారు. మరో వైపు పంచాయతీ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు తీరికలేకుండా పనిచేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆ శాఖ అధికారులు కుస్తీ పడుతుండగా, మండల, జిల్లా పరిషత్ ఎన్నిక పనుల్లో జిల్లా పరిషత్ అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 27న జరిగే పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ చేస్తూనే, ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఆదేశాలు వచ్చినా పంచాయతీ, మండల, జిల్లాపరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఏర్పాట్లలో నిమగ్నం
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం జిల్లా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలో16,156 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా, 29 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 1,995 ఉపాధ్యాయ ఓటర్లకు గాను 25 పోలిగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులను నియమించారు. పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో 2019లో పంచాయతీ ఎన్నికలు మూ డు విడతల్లో జరిగాయి. అప్పుడు 526 పంచాయతీలు, 4,686 వార్డులు ఉండేవి. ఈ సారి పంచాయతీల సంఖ్య పెరిగింది. సంగారెడ్డి జి ల్లా నుంచి బాబుల్‌గావ్ గ్రామం జిల్లాలో చేర గా, తొమ్మిది పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డా యి. దీంతో మొత్తం పంచాయతీల సంఖ్య 536కు చేరింది. వార్డులు 4,696కు చేరాయి. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు 4,715 పోలింగ్‌బూత్‌లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఒక్కో బూత్‌కు ఒక్కో బ్యాలె ట్ బాక్స్ చొప్పున 4,715 బ్యాలెట్ బాక్సులు అవసరమవుతాయి. ఇప్పటికే బ్యాలెట్ పత్రా లు ముద్రించి సిద్ధం చేసిన పంచాయతీ అధికారులు బాక్సులను సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు 7వేల పైచిలుకు సిబ్బంది వివరాలను ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
ఓ వైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు
మరో వైపు ‘స్థానిక’ పోరుకు సన్నద్ధం
ఏర్పాట్లలో జిల్లా అధికారులు బిజీ
25 మండలాలు 237 ఎంపీటీసీ స్థానాలు
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు సైతం జిల్లా అధికారులు ఏర్పాట్లు ముమ్మ రం చేశారు. అప్పట్లో జిల్లాలో 22 మండలాలు ఉండడంతో 22 జెడ్పీటీసీ స్థానాలకు, 236 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ప్ర స్తుతం మూడు కొత్త మండలాలు ఏర్పడడంతో మండలాల సంఖ్య 25 పెరిగింది. దీంతో 25 మండలాలకు సంబంధించి జెడ్పీటీసీ స్థానాల కు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ఒక స్థానం పెరగగా.. ఎంటీటీసీ స్థానాల సంఖ్య 237కు చేరింది. ఆయా మండలాల్లో జెడ్పీటీసీ స్థానాలతోపాటు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment