
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(డీఐఈవో) టి.రాజ్యలక్ష్మి శుక్రవారం ఉదయం 10.20 నిమిషాలకు గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం వారి నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గత మూడున్నరేళ్లుగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న రాజ్యలక్ష్మి టైపిస్టుగా ఉద్యోగంలో చేరి జూనియర్ లెక్చరర్‌గా, ప్రిన్సిపల్‌గా, డీఐఈవోగా సేవలందించారు.
భర్త పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో చేసి గతంలోనే పదవీ విరమణ పొందారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. స్వస్థలం సిరిసిల్ల జిల్లా అయినప్పటికి 30ఏళ్ల క్రితం ఉద్యోగరీత్యా కరీంనగర్‌లోని చైతన్యపురిలో స్థిరపడ్డారు. రాజ్యలక్ష్మి భౌతికకాయానికి కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి, తదితరులు నివాళి అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment