
కరీంనగర్: నగరంలోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై గురువారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని భగత్‌నగర్, టవర్ సర్కిల్, సీతారాంపూర్‌తో పాటు పలు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు.
ఆహార నాణ్యత, వాడుతున్న రసాయనాలు, పలు అంశాలపై ఆరా తీశారు. దాడుల్లో డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు అనిల్‌కుమార్, వరుణ్‌ప్రకాశ్, తహసీల్దార్ దినేష్‌రెడ్డి, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.