కరీంనగర్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మరో కీర్తిని అందుకోంది. ప్రతిష్టాత్మక నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లిమిటెడ్(నాఫ్స్కాబ్) ఆల్‌ఇండియా 2020–21కు గానూ రెండవ, 2021–22కు గానూ మొదటి ఉత్తమ అవార్డులు డీసీసీబీ గెలుచుకుంది. దేశంలో 393 డీసీసీబీలలో కరీంనగర్ డీసీసీబీ ఏడో సంవత్సరం ఏడుసార్లు వరుసగా అఖిలభారత అవార్డును కై వసం చేసుకోవడం గమనార్హం.
ఈ నెల 26న రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగే కార్యక్రమంలో కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు అవార్డులు అందుకోనున్నా రు. జాతీయ అవార్డు లభించడంతో నాబార్డు సీజీ ఎం సుఽశీల, టిస్కాబ్ ఎండీ ఎన్.మురళీధర్ అభినందనలు తెలిపారు. కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు దార్శనికత, చైతన్యవంతమైన నా యకత్వంలోని బృందంతోనే సాధ్యమైందని కొని యాడారు.
దేశంలోని మొత్తం 393 జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో గత మూడేళ్ల పనితీరును విశ్లేషించిన తరువాత దక్షిణ భారతదేశంలో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లి. ఉత్తమ సహకార బ్యాంకుగా ఎంపిక చేసింది. అవార్డు సాధించినందుకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈవో సత్యనారాయణరావు బ్యాంకు ఉద్యోగులకు, రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పటికే పలు అవార్డులు కేడీసీసీబీ సొంతం..
కేడీసీసీబీ అందిస్తున్న ఉత్తమ సేవలకు గానూ గతంలోనూ పలు అవార్డులు పొందింది. నేషనల్ ఫెడరేషన్స్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంకు(నాస్కాబ్) బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డును అందజేసింది. 2015–16 నుంచి వరుసగా ప్రతిష్టాత్మకమైన అవార్డులు సాధి ంచింది. 2015–16లో ద్వితీయ, 2016–17లో తృతీయ, 2017–18లో ద్వితీయ, 2018–19లో ప్రథ మ బహుమతిని కై వసం చేసుకుంది. 2020–21లో ద్వితీయ, 2021–22లో ప్రథమ బహుమతిని అందుకోనుంది. 2018–19 ఏడాదికి గానూ డెమొక్రాటిక్ మేనేజ్‌మెంట్, గుడ్ గవర్నెన్స్ విభాగంలో చైర్మ న్ రవీందర్‌రావు ప్రత్యేక అవార్డు అందుకున్నారు.
చొప్పదండికి ప్రత్యేక గుర్తింపు..
చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కూడ జాతీయ అవార్డును కై వసం చేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చొప్పదండి 2021–22 ఆర్థిక సంవత్సరానికి దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన పీఏసీఎస్‌లో నాఫ్క్సాబ్ మొదటి బహుమతిని గెలుచుకుంది. గతంలోనూ 2017–18, 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాలలో నాఫ్క్సాబ్ జాతీయ అవార్డులను గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment