గుండెపోటుతో 104 కాంట్రాక్టు డ్రైవర్‌ మృతి - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో 104 కాంట్రాక్టు డ్రైవర్‌ మృతి

Published Sat, May 25 2024 12:10 AM

గుండెపోటుతో 104 కాంట్రాక్టు డ్రైవర్‌ మృతి

జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాకేంద్రంలో 104 కాంట్రాక్టు డ్రైవర్‌గా పనిచేస్తున్న కొక్కుల రాజ్‌కుమార్‌(47) గుండెపోటుతో చనిపోయాడు. శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో విధులకు హాజరైన రాజ్‌కుమార్‌ స్పృహతప్పి కింద పడిపోవడంతో తోటి ఉద్యోగులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు గుండపోటుతో చనిపోయాడని నిర్ధారించారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్‌కు చెందిన రాజ్‌కుమార్‌ జగిత్యాల 104 విభాగంలో కాంట్రాక్టు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి కొద్ది రోజులుగా డీఎంహెచ్‌వో కార్యాలయంలో విధులు కేటాయించారు. శుక్రవారం ఉదయం కార్యాలయంలో తీవ్ర అస్వస్థతకు గురికాగా తోటి ఉద్యోగులు జగిత్యాల ప్రభు త్వ ఆస్పత్రికి తీసుకురాగా వైద్యులు మృతిచెందినట్లు ధ్రువీకరించారు. విషయం తెలిసిన రాజ్‌కుమార్‌ బంధువులు, తోటి కాంట్రాక్టు ఉద్యోగులు అక్కడికి చేరుకున్నారు. ఆరునెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో పాటు రాజ్‌కుమార్‌కు వారం, పదిరోజులుగా విరామం లేకుండా విధులు కేటా యించాడంతో అస్వస్థతకు గురయ్యాడని తెలిపా రు. డీఎంహెచ్‌వో కాంట్రాక్టు ఉద్యోగులను తీవ్రంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. ఈ కారణంగానే రాజ్‌కుమార్‌ గుండెపోటుతో చనిపోయాడని ఆందోళన చేపట్టారు. రాజ్‌కుమార్‌ మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

డీఎంహెచ్‌వో వేధింపులే కారణమని ఆందోళన

న్యాయం చేయాలని కుటుంబసభ్యులు, తోటి ఉద్యోగుల డిమాండ్‌

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement