బీజేపీలో చేరితే భయమెందుకు..?
● నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు
కరీంనగర్‌కార్పొరేషన్: తాను బీజేపీలో చేరితో బీఆర్‌ఎస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారని నగర మేయర్‌యాదగిరి సునీల్‌రావు ప్రశ్నించారు. తన ఐదేండ్ల పాలనలో నగరంలో జరిగిన పనులు, పదేండ్లలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన పనులపై విచారణ జరిపించాలని కోరారు. సోమవారం నగరంలోని ఎస్‌బీఎస్ ఫంక్షన్‌హాల్‌లో మాట్లాడారు. నగర అభివృద్ధికి బండి సంజయ్ నిధులు తెచ్చాడని, భవిష్యత్‌లోనూ నగర అభివృద్ధి కొనసాగాలనే తాను బీజేపీలో చేరానన్నారు. కానీ తాను బీజేపీలో చేరిననాటి నుంచి బీఆర్‌ఎస్ నేతలకు నిద్రపట్టడం లేదన్నారు. వాళ్ల అవినీతి చిట్టా బయటపెడుతానని భయపడుతున్నట్లున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లతో కలిసి తనపై అవిశ్వాసం పెడుతుండడాన్ని అపహాస్యం చేశారు. పదవీ కాలం ముగిసిన తర్వాత అవిశ్వాసం పెట్టుకోవచ్చని చమత్కరించారు. ఈ నెల 29న ప్రత్యేక అధికారి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐదేళ్లలో జరిగిన పనులపై జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాలని కోరారు. ఓ నాయకుడి వలె తాను అన్ని నగరాల్లో ఫామ్‌హౌస్‌లు కట్టుకోలేదని, తన బినామీల లాగా చిప్పలు కడిగి, ఇప్పుడు రూ.500 కోట్లకు ఎదగలేదన్నారు. వేసిన బీటీ రోడ్లు మళ్లీ వేసి బిల్లులు తీసుకున్నది ఆ నాయకుడి బినామీలేనన్నారు. ఇసుకపై కేంద్ర విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. వచ్చే బల్దియా ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు సింగిల్ డిజిట్ కూడా దాటనీయమన్నారు. సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు దుర్శేడ్ అనూప్‌కుమార్, కాసర్ల ఆనంద్, రాపర్తి విజయ, నాయకులు బండ రమణారెడ్డి, నాగవల్లి భాస్కర్, నాగసముద్రం ప్రవీణ్, కొండపల్లి సతీశ్, చంద్రమౌళి, కన్నం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
జమ్మికుంట(హుజూరాబాద్): మున్సిపల్ పరిధిలో ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. సోమవారం జమ్మికుంట మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు. పన్నుల వసూళ్లలో రాష్ట్రంలో ముందడుగులో ఉన్న జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందు ఉండేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. పట్టణంపై అవగాహన ఉందని, ఏలాంటి సమస్యలైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అంతకముందు అదనపు కలెక్టర్‌ను మున్సిపల్ కమిషనర్ ఎండీ అయాజ్ శాలువతో సత్కరించి, మొక్క అందజేశారు. కార్యక్రమంలో మేనేజర్ రాజిరెడ్డి, ఏఈ నరేశ్, టీపీవో శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్లు భాస్కర్, వాణి, సిబ్బంది పాల్గొన్నారు.
నాలుగువందల ఇళ్లు కట్టిస్తే పోటీ చేయను
● ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే సవాల్
మానకొండూర్: కనీసం నాలుగువందల ఇళ్లు కట్టించి, బిల్లులు ఇప్పిస్తే తాను ఇక్కడి నుంచి పోటీ చేయనని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు సవాల్ విసిరారు. సోమవారం మానకొండూర్‌లో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి మాట్లాడారు. పథకాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లుతుందన్నారు. ఎంతో గొప్పగా పథకాలు తీసుకువస్తున్నామని హడావుడిగా నియోజకవర్గంలో పోస్టర్లు అంటిస్తూ ప్రచారం చేసుకుంటున్నారని హేళన చేశారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరైతే గ్రామసభల్లో చదివిన లిస్టులో 40 వేల మందికి ఎలా ఇళ్లు కట్టిస్తారని ప్రశ్నించారు. రైతు భరోసా రూ.15 వేల నుంచి రూ.12 వేలు ఇస్తామన్నప్పుడే మీ పతనం మొదలైందన్నారు. దయచేసి ప్రజలు ఇళ్లకు ముగ్గులు పోసుకుని అప్పులపాలు కావద్దన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులు ఉంటే ఆదివారమే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద డబ్బులు వేసేవారని, ఎన్నికలకోసమే ఈ జిమ్మిక్కులన్నారు. మాజీ జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్‌గౌడ్, మాజీ సర్పంచ్ రామంచ గోపాల్‌రెడ్డి, నాయకులు శాతరాజు యాదగిరి, నెల్లి శంకర్, బాలెంకి మల్లేశం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment