పాలక.. వీడ్కోలిక | - | Sakshi
Sakshi News home page

పాలక.. వీడ్కోలిక

Published Tue, Jan 28 2025 12:13 AM | Last Updated on Tue, Jan 28 2025 12:13 AM

పాలక.. వీడ్కోలిక

పాలక.. వీడ్కోలిక

● ముగియనున్న బల్దియా కౌన్సిల్‌ ● నేడు ఆత్మీయ వీడ్కోలు సమావేశం

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థ పాలకవర్గ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. ఇతర మున్సిపాల్టీల పదవీ కాలం ఈ నెల 26తోనే ముగిసింది. కానీ 2020లో ఎన్ని కలకు ముందు డివిజన్‌ల పునర్విభజన అశాసీ్త్రయంగా ఉందంటూ కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో కరీంనగర్‌లో రెండురోజులు ఆలస్యంగా ఎన్నికలు జరిగాయి. దీంతో ఇతర మున్సిపాల్టీలతో పోల్చితే రెండురోజుల తర్వాత నగరపాలక పదవీకాలం ముగుస్తోంది.

నిధుల వరద

2020 జనవరి 29న బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత పాలకవర్గం హయాంలో నిధులు వరదలా వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు రూ.1,700 కోట్లతో న గరంలో వివిధ అభివృద్ధి పనులు జరిగాయి. స్మార్ట్‌ సిటీ నిధులు రూ.930 కోట్లతో నగరంలోని జంక్షన్‌లు, రో డ్లు, 24/7 తాగునీటి సరఫరా తదితర పనులతో నగర రూపురేఖలు మారిపోయాయి. అలాగే అమృత్‌ 1 కింద రూ.132 కోట్లు, అమృత్‌ 2 కింద 147 కోట్లు తాగునీటి సరఫరా కోసం కేటాయించారు. సాధారణ నిధులు రూ.200 కోట్లు, పట్టణ ప్రగతి నిధులు రూ.80 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.40 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.5 కోట్లు, సపాయి మిత్ర సురక్షా కింద వచ్చిన రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు.

ఆరోపణలు.. ఫిర్యాదులు

ప్రస్తుత పాలకవర్గ హయాంలో ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. స్మార్ట్‌ సిటీ పనుల్లో నాణ్యత లోపించిందని అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారంటూ కార్పొరేటర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఒక్క గాంధీ జంక్షన్‌ అభివృద్ధికి సంబంధించి బిల్లులు అధికంగా చెల్లించారంటూ ‘సాక్షి’లో వచ్చిన కథనం మేరకు అప్పటి ఇన్‌చార్జి కమిషనర్‌, అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ సంబంధిత కాంట్రాక్టర్‌ నుంచి డబ్బులు రికవరీ చేయించడం బల్దియా చరిత్రలో మొదటిదిగా నిలిచింది.

నేడు వీడ్కోలు సమావేశం

నగరపాలక పాలకవర్గ పదవీకాలం ముగుస్తున్నందున మంగళవారం ఉదయం 11 గంటలకు నగరపాలక స మావేశ మందిరంలో జరిగే వీడ్కోలు సమావేశానికి కా ర్పొరేటర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, ఎక్స్‌ అఫిషియో సభ్యులు హాజరుకావాలని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, నగరపాలక కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పేయ్‌ కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement