వెల్లువలా దరఖాస్తులు
● ప్రజావాణిలో బాధితుల బారులు ● పరిష్కరించాలని వేడుకోలు
కరీంనగర్ అర్బన్: ప్రజావాణి జన జాతరను మరిపించింది. గత వారం ప్రజావాణి రద్దవడంతో సోమవారం కలెక్టరేట్‌కు అధిక సంఖ్య లో ప్రజలు రాగా కలెక్టర్ పమేలా సత్పతి అర్జీ లు స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్ బాధితుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల కోసం వేర్వేరుగా అర్జీలు తీసుకున్నారు. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లకు సంబంధించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రజావాణికి వచ్చే ప్రతీ అర్జీని ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురిని ‘సాక్షి’ పలకరించగా తమ అవేదనను వివరించారు. వారి మాటల్లోనే..
ప్రజావాణికి వచ్చిన అర్జీలు: 298
కరీంనగర్ నగరపాలిక సంస్థ: 45
కరీంనగర్‌రూరల్ తహసీల్దార్: 18
కొత్తపల్లి తహసీల్దార్: 13
ఇతర అర్జీలు: 222
Comments
Please login to add a commentAdd a comment