ఉన్న ఆస్తిని అమ్మేశారు | - | Sakshi
Sakshi News home page

ఉన్న ఆస్తిని అమ్మేశారు

Published Tue, Jan 28 2025 12:13 AM | Last Updated on Tue, Jan 28 2025 12:13 AM

ఉన్న ఆస్తిని అమ్మేశారు

ఉన్న ఆస్తిని అమ్మేశారు

మాది హుజూరాబాద్‌లోని కాకతీయకాలనీ. నా భర్త శ్రవణ్‌కుమార్‌ బ్లడ్‌ క్యాన్సర్‌తో మరణించారు. మాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. రెక్కాడితే గానీ పూట గడవని పరిస్థితి. పిల్లల పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. నా భర్త ఇల్లే నాకు ఆధారం. నాకు తెలియకుండా అత్త, మామ, ఆడపడచులు విక్రయించారు. ఇదెక్కడి అన్యాయమని సబ్‌ రిజిస్ట్రార్‌, సీఐని కలిస్తే న్యాయం జరగలేదు. గతంలోనే సబ్‌ రిజిస్ట్రార్‌ను కలిసి ఫిర్యాదు చేసిన. ఎలా రిజిస్ట్రేషన్‌ చేస్తారని అడిగితే మరిచిపోయానని చెబుతున్నారు. ఇప్పుడు నా కుటుంబానికి ఆధారమేదీ.. దయలేని అత్తమామలు రోడ్డున పడేశారు.

– వీరగోని రవళి, హుజూరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement