బల్దియా కమిషనర్‌కు విలీన గ్రామాల బాధ్యత | - | Sakshi
Sakshi News home page

బల్దియా కమిషనర్‌కు విలీన గ్రామాల బాధ్యత

Published Wed, Jan 29 2025 12:40 AM | Last Updated on Wed, Jan 29 2025 12:40 AM

-

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థలో విలీనమైన కొత్తపల్లి మున్సిపాలిటీ, చింతకుంట, మల్కాపూర్‌(లక్ష్మిపూర్‌), బొమ్మకల్‌, దుర్శేడ్‌, గోపాల్‌పూర్‌ గ్రామపంచాయతీల బాధ్యతలను కమిషనర్‌ చాహ త్‌ బాజ్‌పేయ్‌కి అప్పగిస్తూ సీడీఎంఏ ఆదేశాలు జారీ చేసింది. గ్రామపంచాయతీల్లో సంవత్సర కాలంగా స్పెషల్‌ ఆఫీసర్ల పాలన కొనసాగుతుండగా, కొత్తపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం పదవీ కాలం ఈ నెల 26వ తేదీతో ముగిసింది. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీ నగరపాలకసంస్థలో విలీనం కావడంతో ఇక నుంచి వాటి పూర్తి నిర్వహణ నగరపాలకసంస్థచేపట్టనుంది. దీనితో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీకి సంబంధించి మినట్స్‌బుక్స్‌ సీజ్‌ చేయడంతో పాటు, బ్యాంక్‌ ఖాతాలు క్లోజ్‌ చేయనున్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పేరిట కొత్తగా ఏదైనా జాతీయ బ్యాంక్‌లో అకౌంట్‌ తీయాలని,భవనాలు,కార్యాలయాలకు నగరపాలకసంస్థ బోర్డులు ఏర్పాటు చేయాలని సీడీఎంఏ ఆదేశాల్లో పేర్కొన్నారు. గామపంచాయతీల ప్రొఫైల్‌, ఉద్యోగులు, సిబ్బంది వివరాలు, ఆస్తులు ,డిపాజిట్‌లు, పన్నులు, కొనసాగుతున్న పథకాలు, బిల్లులు చెల్లింపులు, గత మూడేళ్ల భవన, లేఅవుట్‌ అనుమతులు తదితర సమగ్ర వివరాలను ఫిబ్రవరి 6వ తేదీలోగా తమకు పంపించాలని సీడీఎంఏ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement