ఇయ్యాల్టి నుంచి ప్రత్యేక అధికారి పాలన | - | Sakshi
Sakshi News home page

ఇయ్యాల్టి నుంచి ప్రత్యేక అధికారి పాలన

Published Wed, Jan 29 2025 12:40 AM | Last Updated on Wed, Jan 29 2025 12:40 AM

-

బాధ్యతలు చేపట్టనున్న కలెక్టర్‌

నగరపాలకసంస్థలో బుధవారం నుంచి ప్రత్యేక అధికారి పాలన రానుంది. పాలకవర్గం పదవీ కాలం మంగళవారం ముగిసింది. కలెక్టర్‌ పమేలా సత్పతిని బల్దియా ప్రత్యేక అధికారిగా నియమించారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేక అధికారి పాలన మొదలవుతుండడంపై నగరవాసులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. గాడి తప్పిన నగరపాలకసంస్థలోని వివిధ విభాగాలను సరైన మార్గంలోకి మళ్లించాలంటున్నారు. ముఖ్యంగా అధికారులు, ఉద్యోగుల్లో లోపించిన జవాబుదారితనం, జాడ లేని పారదర్శకతపై కలెక్టర్‌ దృష్టి సారించాల్సి ఉంది. ఇంజనీరింగ్‌, శానిటేషన్‌, రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్‌, మెప్మా విభాగాల్లో చోటుచేసుకొంటున్న అక్రమాలు, అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులపై ఆరా తీస్తే సగం సమస్యలు తీరే అవకాశం ఉంది. కొంతమంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఆధిపత్యమే నగరపాలకసంస్థలో అధికం. కొద్దిమంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పూర్తిగా కార్యాలయాన్ని తమ నియంత్రణలో పెట్టుకోవడంతో పాటు, రెగ్యులర్‌ అధికారులనే బెదిరించిన ఉదంతాలు గతంలో చోటుచేసుకొన్నాయి. కలెక్టర్‌ సెక్షన్‌ల వారిగా సమీక్షించి చర్యలు చేపడితే తప్ప బల్దియా గాడినపడే అవకాశం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement