కరీంనగర్ అర్బన్: ఎల్ఆర్ఎస్ 2020 పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులపై ఇరిగేషన్, పంచాయతీ, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దరఖాస్తులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో అదనపు సిబ్బందిని కేటాయిస్తామన్నారు. ఎంపీవోలు, ఆర్ఐలు, పంచాయతీ కార్యదర్శులు, అసిస్టెంట్ ఇంజినీర్లు సమన్వయంతో పని చేస్తూ పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేయాలని అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మున్సిపాలిటీ, కొత్తపల్లి మండల పరిధిలోని దరఖాస్తులు పరిష్కరించేందుకు అదనంగా 9 మంది సిబ్బందిని కేటాయిస్తామని తెలిపారు. నిబంధన ప్రకారం లేని దరఖాస్తులు తిరస్కరించి, మిగతావి పరిష్కరించాలన్నారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఎల్పీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment