ప్రభుత్వ కళాశాలల్లో ఉజ్వల భవిష్యత్
కరీంనగర్ సిటీ: ప్రభుత్వ కళాశాలల్లో చదివినవారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం ఫెరియా ఫియస్టా పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ఎగ్జిబిట్లు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానికంగా అన్ని వసతులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరి విద్యార్థులు ఉజ్వల భవిష్యత్‌ను నిర్మించుకోవాలని సూచించారు. చదువుతో పాటు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ... కళాశాలలోని సౌకర్యాలను వినియోగంలోకి తెచ్చేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. ప్రిన్సిపాల్ డి.వరలక్ష్మి మాట్లాడుతూ 2,700 మంది విద్యార్థులతో స్వయం ప్రతిపత్తి కలిగిన మహిళా డిగ్రీ కళాశాల ఉత్తర తెలంగాణలో ప్రముఖ విద్యాసంస్థగా రూపొందుతోందని తెలిపారు. ఫెరియా ఫియస్టా కార్యక్రమంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన 160 స్టాళ్లను కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ప్రారంభించారు. మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హెల్త్‌క్యాంపు నిర్వహించారు. పాటలు, నృత్య పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఫెరియా ఫియస్టా కన్వీనర్ డాక్టర్ ఆర్.మొగిలి, కో– ఆర్డినేటర్లు, రజిని, స్రవంతి పాల్గొన్నారు.
కలెక్టర్ పమేలా సత్పతి
అలరించిన ఫెరియా ఫియస్టా
Comments
Please login to add a commentAdd a comment