అక్రమ పట్టాలు రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

అక్రమ పట్టాలు రద్దు చేయాలి

Published Tue, Jan 28 2025 12:13 AM | Last Updated on Tue, Jan 28 2025 12:13 AM

అక్రమ

అక్రమ పట్టాలు రద్దు చేయాలి

మూడుదశాబ్దాల క్రితం దొరల వద్ద భూములు కొనుగోలు చేశాం. 30 ఏళ్లుగా పంటలు పండిస్తున్నం. కాస్తు, కబ్జాలో మేమే ఉన్నాం. కానీ ఓ తహసీల్దార్‌, ఆర్‌ఐ ఏలాంటి విచారణ లేకుండానే 2006లో సంబంధం లేని వ్యక్తుల పేరిట భూ రికార్డులో నమోదు చేశారు. అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం. అక్రమంగా పట్టా చేసుకుని మమ్మల్ని భయాభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఉన్నతాధికారులు మోఖాపై విచారణ జరిపి సదరు పట్టాలను రద్దు చేసి మాకు శాశ్వత పరిష్కారం చూపాలి.

– కోరపల్లి–వెంకటేశ్వరపల్లి గ్రామస్తులు, జమ్మికుంట

రహదారి విస్తరణ ఆపండి

ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసేలా స్థలమున్నా నిబంధనలు మార్చి రోడ్లను నిర్మిస్తున్నారు. వంద గజాల్లో రహదారిని నిర్మించే అవకాశమున్నా కావాలని ఇబ్బందులు సృష్టిస్తున్నారు. 125 గజాల పేరుతో ఆర్‌అండ్‌బీ ఉత్తర్వులు జారీ చేయడం చాలా ఇబ్బందికరం. వంద గజాలకు మించి నిర్మాణాలుండవని, గతంలోనే సెట్‌బ్యాక్‌ చేసి నిర్మాణాలు చేసుకున్నాం. తీరా 125 గజాలని సర్క్యులర్‌ తెచ్చి నిర్మాణాలను కూల్చే ప్రయత్నం చేస్తే ఊరుకోం. ఉన్నతాధికారులు చొరవ చూపి పరిష్కారం చూపాలి.

– ఆర్‌వోబీ జేఏసీ సభ్యులు, తీగలగుట్టపల్లి, కరీంనగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
అక్రమ పట్టాలు రద్దు చేయాలి
1
1/1

అక్రమ పట్టాలు రద్దు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement