మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలు | - | Sakshi
Sakshi News home page

మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలు

Published Wed, Jan 29 2025 12:29 AM | Last Updated on Wed, Jan 29 2025 12:29 AM

మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలు

మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలు

కరీంనగర్‌/కరీంనగర్‌రూరల్‌: జిల్లాలోని మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 18నుంచి ప్రారంభమైంది. వచ్చేనెల 28వరకు ప్రక్రియ కొనసాగనుంది. ఆయా గురుకులాల్లో అడ్మిషన్ల కోసం ఉపాధ్యాయులు ఇంటింటా ప్రచా రం నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 9 మైనార్టీ గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో ఐదు బాలుర, నాలుగు బాలికల పాఠశాలలున్నాయి. కరీంనగర్‌ మండలం బొమ్మకల్‌లోని విట్స్‌ కళాశాల ప్రాంగణంలో బాలుర గురుకుల పాఠశాల–1, ఇరుకుల్లలో బాలు ర పాఠశాల–2, మొగ్ధుంపూర్‌లో బాలుర పాఠశాల–3, కరీంనగర్‌లోని గణేష్‌నగర్‌లో బాలికల పాఠశాల–2, రేకుర్తిలో బాలికల పాఠశాల–1,జమ్మికుంటలో బాలికల పాఠశాల,హుజురాబాద్‌లో బాలుర పాఠశాల,చొప్పదండిలో బాలికల పాఠశాల, మానకొండూరులో బాలుర పాఠశాలలున్నాయి. మైనా ర్టీలతోపాటు బీసీ, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు గురుకులాల్లో ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2025–26 విద్యాసంవత్సరానికి 5వ తరగతితోపాటు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ కోర్సులు, 6,7,8 తరగతుల్లో మైనార్టీ మిగులు సీట్ల భర్తీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్ధులు దరఖాస్తు చేసుకునే వీలుంది.

రిజర్వేషన్లు ఇలా...

గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం రిజర్వేషన్‌ విధానం అమలు చేస్తున్నారు. ఒక్కో గురుకుల పాఠశాలలో మొత్తం 80 సీట్లు ఉంటాయి. దీనిలో 75 శాతం మైనార్టీలు, 25శాతం నాన్‌ మైనార్టీలకు ప్రవేశం కల్పించారు. మైనార్టీ కోటాలో ముస్లింలకు 64శాతం, క్రిస్టియన్లు 7శాతం, జైన, పార్సీ, బౌద్ధ,సిక్కులకు కలిపి 4శాతం సీట్లు కెటాయించారు. నాన్‌ మైనార్టీ కోటాలో ఎస్సీలకు 6శాతం, ఎస్టీ 4శాతం, బీసీ 12శాతం, ఓసీలకు 3శాతం సీట్లున్నాయి.

ఉపాధ్యాయుల ప్రచారం

మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బొమ్మకల్‌ బైపాస్‌లోని విట్స్‌ ప్రాంగణంలోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాల–1 చెందిన ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్‌ వీర్ల మహేశ్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇంటింటా తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు.

అడ్మిషన్ల కోసం ఉపాధ్యాయుల ప్రచారం

జిల్లాలో తొమ్మిది పాఠశాలలు

సద్వినియోగం చేసుకోవాలి

మైనార్టీ గురుకులాల్లోని సౌకర్యాలను వివరిస్తు అడ్మిషన్లపై విస్తృత ప్రచారం చేపట్టాం. తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– సురేశ్‌, ఆర్‌ఎల్‌సీ, కరీంనగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement