మంత్రివర్యా.. మాటలు వెనక్కి తీసుకోండి
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ కలెక్టర్‌తో మాట్లాడిన మాటలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో తమ మద్దతు ఉండదని జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ భాగస్వామ్య పక్షాలు స్పష్టం చేశాయి. జిల్లాలో దాదాపు 50 వేల మంది ఉద్యోగులున్నారని ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ధి చెబుతామని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం టీఎన్జీవో, టీజీవో, పెన్షనర్లు, నాలుగో తరగతి ఉద్యోగులు, ట్రెజరీ, జెడ్పీ, పంచాయతీరాజ్, మహిళా జేఏసీ సంఘాలు ప్రకటన విడుదల చేశాయి. స్వార్థ రాజకీయాలకు అధికారులు, ఉద్యోగులను బలి చేయడం భావ్యం కాదన్నారు. రోజురోజుకు దిగజారుడు రాజకీయం పెరుగుతోందని అవేదన వ్యక్తం చేశాయి. రాజకీయాల్లోకి ఐఎఎస్, ఐపీఎస్‌లను లాగితే తామెంటో నిరూపించే రోజులొస్తాయని ప్రకటించారు. జిల్లాలో జరిగిన ఘటనల క్రమంలో రాష్ట్ర జేఏసీ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. కలెక్టర్ చేసిన తప్పేంటని, అన్ని రాజకీయపక్షాలను, ప్రజాప్రతినిధులను కలుపుకొని ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి అనుక్షణం పర్యవేక్షించడమే తప్పా అని ప్రశ్నించారు. అనాలోచితంగా సహనాన్ని కోల్పోయి కలెక్టర్‌పై అవాకులు, చవాకులు మాట్లాడటం, బాధ్యత గల పదవిలో ఉన్నవారికి తగదని హితవు పలికారు. సహనాన్ని పరీక్షించొద్దని, తాము తలుచుకుంటే ప్రజలతో మమేకమై ఏ ప్రజాప్రతినిధి ఏమి చేస్తున్నాడో సవివరంగా వివరించే శక్తి, సత్తా ఉందని గుర్తుంచుకోవాలని సూచించారు. టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సంగెం లక్ష్మణ్ రావు, టీజీవో అధ్యక్షుడు మడిపల్లి కాళిచరణ్, కార్యదర్శి అరవింద్ రెడ్డి, నాగరాజు, కేంద్ర సంఘం ఉపాధ్యక్షుడు నాగుల నరసింహస్వామి, అసోసియేట్ అధ్యక్షుడు ఒంటెల రవీందర్ రెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి, మహిళా జేఏసీ చైర్మన్ ఇరుమల్ల శారద తదితరులు ఉన్నారు.
కలెక్టర్‌పై అనుచిత వ్యాఖ్యలు సహించం
ఎంప్లాయీస్ జేఏసీ భాగస్వామ్య పక్షాల ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment