ఇంటికి చేరిన బాధితుడు | - | Sakshi
Sakshi News home page

ఇంటికి చేరిన బాధితుడు

Published Wed, Jan 29 2025 12:29 AM | Last Updated on Wed, Jan 29 2025 12:29 AM

ఇంటిక

ఇంటికి చేరిన బాధితుడు

కోనరావుపేట(వేములవాడ): ఉపాధి నిమిత్తం ఓ యువకుడు సౌదీ వెళ్లగా కంపెనీ యాజమాన్యం వేతనమివ్వక, అడిగితే కొట్టడంతో బాధితుడు తన గోడు వెల్లబోసుకున్నాడు. అతడి వ్యథను ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ప్రభుత్వ విప్‌ స్పందించి బాధితుడు ఇంటికి చేరేలా చర్యలు తీసుకోగా మంగళవారం చేరుకున్నాడు. వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన మెరుగు అంజి ఏడాది క్రితం బతుకుదెరువు కోసం డ్రైవరు వీసాపై బొంబాయ్‌లోని విజయ్‌ గల్ఫ్‌ ఆఫీసులో రూ.లక్షన్నర చెల్లించి సౌదీ వెళ్లాడు. అక్కడ కంపెనీవారు ఐదు నెలల నుంచి జీతం ఇవ్వకుండా, పని చేయించుకుని సరైన సమయానికి అన్నం పెట్టకుండా పాస్‌పోర్టు లాక్కొని ఇబ్బందులు పెట్టారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇవ్వకుండా అక్కడి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తనను కాపాడాలని బాధితుడు అంజి సీఎం రేవంత్‌రెడ్డి, విప్‌ ఆది శ్రీనివాస్‌ను సోషల్‌ మీడియాలో వేడుకోగా, అతడి బాధను శ్రీసాక్షిశ్రీ 2024 ఆగస్ట్‌ 9న ప్రచురించింది. విప్‌ ఆది తక్షణమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండియన్‌ ఎంబసీ, సౌదీ అరేబియా దేశానికి లేఖ రాసి అధికారులతో మాట్లాడారు. అంజి ఆచూకీ తెలుసుకోవాలని సౌదీలో ఉన్న ఎన్నారై బైరదేవ్‌ యాదవ్‌ను కోరాడు. ఈనేపథ్యంలో అంజి ఆచూకీని బైరదేవ్‌యాదవ్‌ కనుక్కొని తన రూంలో ఐదు నెలలపాటు ఆశ్రయం కల్పించాడు. పాస్‌పోర్ట్‌ కంపెనీవారు ఇవ్వకపోవడంతో కొత్త పాస్‌పోర్ట్‌, వీసా టిక్కెట్‌ కొని ఏర్పాట్లు పూర్తవడంతో ఈనెల 27న బయలుదేరిన అంజి మంగళవారం ఇంటికి చేరాడు. ఈసందర్భంగా విప్‌ ఆది శ్రీనివాస్‌, ఐదు నెలలు ఆశ్రయం కల్పించిన బైరాదేవ్‌ యాదవ్‌కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సౌదీలో కొలనూర్‌వాసి నరకయాతన

వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ కథనం

స్పందించి ఎంబసీకి లేఖ రాసిన విప్‌ శ్రీనివాస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
ఇంటికి చేరిన బాధితుడు1
1/2

ఇంటికి చేరిన బాధితుడు

ఇంటికి చేరిన బాధితుడు2
2/2

ఇంటికి చేరిన బాధితుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement