![నేరెళ్ల హత్య కేసులో మరో వ్యక్తి రిమాండ్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/29/28dmp04-180085_mr-1738090431-0.jpg.webp?itok=BWTsj7ks)
నేరెళ్ల హత్య కేసులో మరో వ్యక్తి రిమాండ్
ధర్మపురి: ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో ఓ వ్యక్తిని హత్య చేసి.. కాల్చి చంపిన సంఘటనలో పోలీసులు గతంలో ఇద్దరిని అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఇదే ఘటనలో పాల్గొన్న మరో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ రాంనర్సింహారెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని కమలాపూర్‌కు చెందిన నేరెళ్ల గోపాల్, నేరెల్లకు చెందిన గండికోట శేఖర్ కలిసి 2024 డిసెంబర్ 12న ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్ సూర్యప్రకాశ్‌సింగ్‌ను ముంబయి నుంచి కారులో నేరెల్లకు తీసుకొచ్చారు. డిసెంబర్ 13న సాంబశివ దేవాలయం వద్ద హత్య చేసి సారంగపూర్ మండలం బట్టపెల్లి, పోతారం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేశారు. ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు గోపాల్, శేఖర్‌ను డిసెంబర్ 22న అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న మూడో వ్యక్తి మెరుగు లస్మయ్యను మంగళవారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment