![వైద్యులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11hzb156-180018_mr-1739299828-0.jpg.webp?itok=s9F2etgG)
వైద్యులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు
● డీఎంహెచ్‌వో వెంకటరమణ
హుజూరాబాద్: ప్రభుత్వాస్పత్రి వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో వెంకటరమణ హెచ్చరించారు. హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిని మంగళవారం తనిఖీ చేశారు. పలు వార్డులను పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని అన్నారు. ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య తగ్గిందని, పెంచాలని సూ చించారు. కొన్ని విభాగాల సిబ్బంది పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకుంటే ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానని అన్నారు. ప్రాంతీయ ఆస్పత్రిలో జరుగుతున్న సంఘటనలపై కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం మధ్యాహ్నం ఫోర్‌మెన్ కమిటీ విచారణ చేపట్టింది. కరీంనగర్ ఆసుపత్రి ఆర్‌ఎంవో నవీన, డాక్టర్ రవి ప్రవీణ్‌రెడ్డి, ఏవో ఆహ్మద్, సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ కమిటీలో ఉన్నారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు అందించనున్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో చందు, ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డి, ఆర్‌ఎంవో సుధాకర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment