![గడువులోగా స్మార్ట్‌సిటీ పనులు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11knt51-180142_mr-1739299827-0.jpg.webp?itok=EkE02T4G)
గడువులోగా స్మార్ట్‌సిటీ పనులు
● నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్
కరీంనగర్ కార్పొరేషన్: నిర్ణీత గడువులోగా స్మార్ట్‌సిటీ పనులు పూర్తి చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ ఆదేశించారు. మంగళవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం విధించిన మార్చి 31వ తేదీ గడువులోగా పనులు పూర్తికావాలన్నారు. డిజిటల్ ల్రైబ్రరీ, బాలసదన భవనం, కాశ్మీర్‌గడ్డ సమీకృత మార్కెట్, పద్మనగర్ జంక్షన్, టవర్ సర్కిల్ ఆధునీకరణ, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ భవనం తదితర నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు వెనక్కి వెళ్లకుండా పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఈఈ యాదగిరి, డీఈలు ఓంప్రకాశ్, లచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు, అయూబ్‌ఖాన్, సతీశ్, పీఎంసీ అధికారి సందీప్ పాల్గొన్నారు.
పారిశుధ్య పనులు సక్రమంగా చేపట్టాలి
కొత్తపల్లి: పారిశుధ్య పనులు సక్రమంగా చేపట్టాల ని నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ సూచించారు. కరీంనగర్‌లో విలీనమైన చింతకుంటలో మంగళవారం పర్యటించారు. విలీన గ్రామాల్లో పారిశుధ్య పనులను పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. బయోమెట్రిక్ పద్ధతిలో కార్మికుల హాజ రు నమోదు చేయాలన్నారు. జవాన్లు, వార్డు ఆఫీస ర్లు, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్లు ప్రతిరోజు పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. అసిస్టెంట్ కమిషనర్ వేణుమాధవ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment