![వివరా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11mnk01-180004_mr-1739299826-0.jpg.webp?itok=9azzGbzm)
వివరాలు వెల్లడించి సర్వేపై మాట్లాడండి
● మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ కార్పొరేషన్: తమ ప్రభుత్వం చారిత్రాత్మకంగా చేపట్టిన కులగణనపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్, బీజేపీలకు లేదని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని ఆయన నివాసంలో మాట్లాడుతూ.. ఎవరి లెక్క ఏంటో తేలాలని భారత్ జోడోయాత్రలో రాహుల్‌గాంధీ చెప్పారని గుర్తు చేశారు. ఆ క్రమంలోనే తాము కులగణన చేపట్టామన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని, ఆ రెండు పార్టీలకు కులగణనపై మాట్లాడే అర్హత లేదన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా కులగణను చేపట్టాలని డిమాండ్ చేశారు. సర్వేలో పాల్గొని మాట్లాడాలని బీఆర్‌ఎస్ నేతలకు సూచించారు. అందుకే బీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు సర్వేఫారాలు పంపిస్తున్నట్లు తెలిపారు. బీసీలకు న్యాయం చేసేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు. నాయకులు ఆకారపు భాస్కర్‌రెడ్డి, మల్లికార్జున రాజేందర్ పాల్గొన్నారు.
‘దమ్ముంటే కేటీఆర్ సవాల్‌ను స్వీకరించండి’
మానకొండూర్: కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే కొడంగల్‌లో కేటీఆర్ విసిరిన సవా ల్‌ను స్వీకరించాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు హెచ్చరించారు. మానకొండూర్‌లో మంగళవారం మాట్లాడుతూ.. కరీంనగర్‌లో ఎమ్మెల్సీ నామినేషన్లకు వచ్చిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. గత ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ మంత్రులు ఎన్ని కల కోడ్ ఉల్లంఘించారని, దీనిపై ఎన్నికల క మిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. మాజీ జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్‌గౌడ్,యాదగిరి, శ్రీనివా స్‌గౌడ్, రామంచ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
విద్యార్థులను దత్తత తీసుకోవాలి
మానకొండూర్: పదోతరగతిలో వెనకబడిన విద్యార్థులను దత్తత తీసుకోవాలని డీఈవో జనార్దన్‌రావు ఉపాధ్యాయులకు సూచించారు. మానకొండూర్ మండలం అన్నారం ఉన్నత పాఠశాలలో టీ–శాట్ ద్వారా నిర్వహిస్తున్న మోటివేషన్ ఆన్‌లైన్ తరగతులను మంగళవారం పరిశీలించారు. పదోతరగతి విద్యార్థులకు ఈ నెల రోజులు చాలా కీలకమని సూచించారు. ఉపాధ్యాయులు వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు కొండ శైలజ, ఉపాధ్యాయులు జయేంద్రరెడ్డి, కూర శ్రీనివా స్, జైపాల్‌రెడ్డి, మురళీకృష్ణ, శ్రీవాణి, శైలజ, వీరన్న మమత పాల్గొన్నారు.
అడ్మిషన్ల కోసం ఎస్సారార్ అధ్యాపకుల ప్రచారం
కరీంనగర్ సిటీ: ‘మా కళాశాలలో చేరండి.. ఉన్నత విద్య అనుభజ్ఞులైన అధ్యాపకులున్నారని’ కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాల అధ్యా పకులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం అడ్మిషన్ల కోసం మంగళవారం పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, తెలంగాణ మోడల్ కళాశాలలను సందర్శించా రు. ఎస్సారార్‌లోని సౌకర్యాలు, అందుబాటులో ఉన్న కోర్సులను గురించి వివరించారు. తెలంగాణ మోడల్ స్కూల్ తిమ్మాపూర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తిమ్మాపూర్, ప్రభుత్వ జూ నియర్ కళాశాల గంగాధర, తెలంగాణ మోడ ల్ స్కూల్ న్యాలకొండపల్లి, ప్రభుత్వ జూని యర్ కళాశాల కొడిమ్యాల, తెలంగాణ మోడల్ స్కూల్‌లో అడ్మిషన్ల కోసం ప్రచారం నిర్వహించారు. అధ్యాపకులు ఎం.మల్లారెడ్డి, జి.కష్ణారెడ్డి, సీ.హెచ్ ప్రవీణ, టి.అరవింద్, కేఎస్.ప్రణీత్ చౌదరి, ఎం.సంజీవం, బి.ప్రశాంత్, పి.చైతన్య, ఏ.స్వరూపారాణి పాల్గొన్నారు.
![వివరాలు వెల్లడించి సర్వేపై మాట్లాడండి
1](https://www.sakshi.com/gallery_images/2025/02/12/11mnk03-180004_mr-1739299826-1.jpg)
వివరాలు వెల్లడించి సర్వేపై మాట్లాడండి
![వివరాలు వెల్లడించి సర్వేపై మాట్లాడండి
2](https://www.sakshi.com/gallery_images/2025/02/12/11knt102-180126_mr-1739299826-2.jpg)
వివరాలు వెల్లడించి సర్వేపై మాట్లాడండి
![వివరాలు వెల్లడించి సర్వేపై మాట్లాడండి
3](https://www.sakshi.com/gallery_images/2025/02/12/11knt405-604887_mr-1739299826-3.jpg)
వివరాలు వెల్లడించి సర్వేపై మాట్లాడండి
Comments
Please login to add a commentAdd a comment