![సదరం.](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11knt326-180127_mr-1739299827-0.jpg.webp?itok=YPpla05K)
సదరం.. కాసుల వర్షం
● అక్రమార్కుల అండతో అనర్హులకు సర్టిఫికెట్లు ● ఒక్కొక్కరి వద్ద రూ.20వేల నుంచి రూ.30వేలు వసూలు ● ఉన్నతాధికారి చొరవతో వ్యవహారం బట్టబయలు ● సెక్యూరిటీ గార్డు తొలగింపు
‘ఓ దివ్యాంగుడికి సర్టిఫికెట్ ఇప్పించేందుకు ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో పనిచేసే సెక్యూరిటీ గార్డు నేరుగా అతని కుటుంబ సభ్యులకే ఫోన్ చేశాడు. రూ.30వేలు ఇస్తే సర్టిఫికెట్ ఇప్పిస్తానన్నాడు. అనుమానం వచ్చిన దివ్యాంగుడి కుటుంబ సభ్యులు నేరుగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. వాయిస్ రికార్డు పరిశీలించిన సదరు అధికారి సెక్యూరిటీగార్డును విధుల్లోంచి తొలగించారు.’
కరీంనగర్‌టౌన్: జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో సదరం క్యాంపులు కాసులు కురిపిస్తున్నా యి. అనర్హులకు దొడ్డిదారిన సర్టిఫికెట్లు కట్టబెడుతూ అందినకాడికి దండుకుంటున్నారు. అర్హులను సైతం కాసులకోసం వేధిస్తున్నారు. సంబంధిత విభాగం అధికారులు ఏజిల్ గ్రూపులో పనిచేసే కాంట్రాక్టు సిబ్బందిని ఏజెంట్లుగా పెట్టుకుని దందా సాగిస్తున్నారు. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.20వేల నుంచి రూ.30వేలు వసూలు చేస్తుండడంతో.. ప్రతీ శిబిరంలో రూ.లక్షల్లో చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. స్లాట్ బుకింగ్ మొదలుకుని, సర్టిఫికెట్ పొందే వరకు కొందరు మధ్యవర్తులు వ్యవహారాన్ని నడిపిస్తూ డబ్బులు దండుకుంటున్నట్లు సమాచారం వినిపిస్తోంది.
70 శాతం మంది అనర్హులే
సదరం సర్టిఫికెట్లు జారీచేసేందుకు ప్రతీనెల ప్రభుత్వ ఆస్పత్రిలో శిబిరాలు నిర్వహిస్తారు. స్లా ట్‌బుక్ చేసుకుని హాజరయ్యే వారిలో 70శాతం మంది అనర్హులే ఉంటారు. దివ్యాంగుల సర్టిఫికె ట్ ఉంటే రూ.3,016 ప్రభుత్వ పెన్షన్, వివిధ పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో ఏ విధంగానైనా సదరం సర్టిఫికెట్ పొందాలని శిబిరానికి హాజరవుతున్నారు. సరిగ్గా ఇలాంటి వారి కోసమే ఆస్పత్రి ఆవరణలో కాచుకునిచూసే అక్రమార్కులు రూ.20వేల నుంచి రూ.30వేలు ఇస్తే సర్టిఫికె ట్ ఇప్పిస్తామంటూ నమ్మిస్తున్నారు. శిబిరంలో వారికి అనుకూలమైన వైద్యుడు ఉంటే సరే. లేదంటే మరోసారి స్లాట్ బుక్ చేయిస్తున్నారు. ఇలా శిబిరానికి 70శాతం మంది హాజరుకాకపోవడంతో పెండింగ్ లిస్టు పెరిగిపోతోంది. సదరం సర్టిఫికెట్ పొందాలనుకునే అనర్హులు చాలామంది తమకు తెలిసిన ప్రజాప్రతినిధులను, స్థానిక నేతలను ఆశ్రయించి అధికారులపై ఒత్తిడి పెంచుతుండడం గమనార్హం.
అసలు దొంగలపై చర్యలేవి?
సదరం సర్టిఫికెట్ ఇప్పిస్తానంటూ వసూళ్లకు తెగబడిన సెక్యూరిటీ గార్డును అధికారులు తొలగించారు. సెక్యూరిటీ గార్డులాగా ప్రభుత్వాసుపత్రిలో చాలా మంది అక్రమార్కులు తయారయ్యారు. కొంతమంది ఉద్యోగులు సూత్రధారులుగా, ఏజిల్ సిబ్బంది పాత్రధారులుగా ఈ సర్టిఫికెట్ల దందా నిరాటంకంగా కొనసాగుతోంది. అసలు దొంగలైన సూత్రధారులపై చర్యలు చేపట్టాలనే డిమాండ్ పెరుగుతోంది.
కఠిన చర్యలు తీసుకుంటాం
సదరం సర్టిఫికెట్ల వ్యవహారంలో డబ్బులు వసూలు చేస్తూ అనర్హులకు సర్టిఫికెట్టు ఇప్పించే ప్రయత్నం చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపడతాం. ఇప్పటికే సెక్యూరిటీ గా ర్డును తొలగించాం. దీని వెనుక ఎవరున్నా విచారణ చేపడతాం. ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఎవరైనా సదరం సర్టిఫికెట్లు ఇప్పిస్తామంటూ డబ్బులు డిమాండ్ చేస్తే మాకు ఫిర్యాదు చేయాలి.
– డాక్టర్ వీరారెడ్డి, సూపరింటెండెంట్
![సదరం.. కాసుల వర్షం1](https://www.sakshi.com/gallery_images/2025/02/12/sakshifocus2016_mr-1739299827-1.jpg)
సదరం.. కాసుల వర్షం
![సదరం.. కాసుల వర్షం2](https://www.sakshi.com/gallery_images/2025/02/12/11knt329-180127_mr-1739299827-2.jpg)
సదరం.. కాసుల వర్షం
Comments
Please login to add a commentAdd a comment