రౌడీ షీటర్ జిల్లా బహిష్కరణ
సిరిసిల్లక్రైం: నేర ప్రవత్తిని మార్చుకోకుంటే జిల్లా బహిష్కరణ చే స్తామని పోలీస్ బాస్ వెల్లడించిన 72 గంటల్లోనే చర్యలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన రౌడీ షీటర్ మోయిజ్‌పై జిల్లా బహిష్కరణ వేటు వేస్తూ టౌన్ సీఐ కృష్ణ మంగళవారం నోటీసులు జారీ చేశారు. మోయిజ్ జిల్లాలో ఎక్కడైనా కనపడితే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. అతడిపై సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 కేసులు ఉన్నాయని, హ త్య, హత్యాయత్నం, ఆయుధాల చట్టం, బెదిరింపులకు పాల్పడడం, యూట్యూబ్ చానల్ వేదికగా వ్య క్తిని విచక్షణారహితంగా కొట్టడం వంటి కేసుల్లో నిందుతునిగా ఉండి రౌడీషీటర్ ఉన్నా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో నోటీసు జారీ చేసినట్లు వివరించారు. ప్రజాశాంతికి, సామాన్య ప్రజా నీకానికి ఇబ్బందులు కలిగిస్తున్నాడనే ఫిర్యాదుల మేరకు అతడిపై తెలంగాణ సామాజిక వ్యతిరేక, ప్రమాదకర కార్యక్రమ చట్టం 1980 ప్రకారం జిల్లా బహిష్కరణ నోటీస్ జారీ చేశామని వెల్లడిచంచారు.
ఆన్‌లైన్ బెట్టింగ్‌లో నష్టం.. అద్దెకు ఉంటున్న ఇంట్లో చోరీ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడిన యువకుడు, డబ్బుల కోసం అద్దెకు ఉ ంటున్న ఇంటికే కన్నం వేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు.. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాసోజి విజయ్ మండల కేంద్రంలోని బందారపు గంగిరెడ్డి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. విజ య్ స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చే స్తున్నాడు. ఇటీవల ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. డబ్బు కోసం ఎనిమిదేళ్లుగా అద్దెకు ఉంటు న్న ఇంటిపైనే కన్నేశాడు. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడ్డాడు. ఇంట్లో దాచి న 4 తులాల బంగారం గొలుసు, అర తులం కమ్మలు, ఐదు గ్రాముల ఉంగరం, అర తులం చైన్ ఎత్తుకెళ్లాడు. బాధితుడు గంగిరెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మంగళవారం మండల కేంద్రంలోని కొత్తబస్టాండ్ ఏరియాలో విజయ్‌ని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించగా, రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment