కరీంనగర్ అర్బన్: జిల్లాలో పలువురికి నాయబ్ తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టరేట్ ప్రధాన విభాగంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్లు తిరుపతి సంపత్, ప్రణీత్, మణ్మిత్ సింగ్, ఎఫ్ఐ రాజమధుకర్, ఆర్ఐలు మాధవి, శివరామకృష్ణ, ఫహీం, శరత్‌కుమార్‌కు నాయబ్ తహశీల్దార్లుగా పదోన్నతి లభించింది. శివరామకృష్ణ, శరత్ కుమార్‌ను కామారెడ్డి జిల్లాకు అలాట్ చేయగా ప్రణీత్ కరీంనగర్ డీఎం సివిల్ సప్లై కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. మన్మిత్ సింగ్, రాజమధుకర్, సంపత్, మాధవి, ఫహీంలను సిద్దిపేట జిల్లాకు అలాట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment