ప్రియుడి ఫోన్‌లో 13 వేల నగ్న ఫోటోలు.. అంతా సహ ఉద్యోగులే | Bengaluru Woman Checks Boyfriend's Phone, Finds 13,000 Naked Photos: Report - Sakshi
Sakshi News home page

ప్రియుడి ఫోన్‌లో 13 వేల నగ్న ఫోటోలు.. అంతా సహ ఉద్యోగులే

Published Fri, Dec 1 2023 12:58 AM | Last Updated on Fri, Dec 1 2023 1:04 PM

- - Sakshi

బనశంకరి: యువతులతో కలిసిన ఏకాంత క్షణాల్లో ఫోటోలు తీసి మొబైల్‌ఫోన్‌లో సేకరించిన ప్రైవేటు కంపెనీ ఉద్యోగిని బెంగళూరు సీసీబీ పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్‌చేశారు. బెళ్లందూరు సమీపంలోని ఓ బీపీఓ కంపెనీలో ఐటీ ఇంజినీరుగా పనిచేసే మంగళూరుకు చెందిన ఆదిత్య సంతోష్‌ (23) నిందితుడు.వివరాలు.. ఘరానా టెక్కీ ఆదిత్య సంతోష్‌, అదే ఆఫీసులో పనిచేసే యువతి ప్రేమలో పడ్డారు.

ఇద్దరు అప్పుడప్పుడు ఏకాంతంగా గడిపారు. ఈ దృశ్యాలను సంతోష్‌ తన మొబైల్‌ఫోన్‌లో రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు.కొన్ని రోజుల క్రితం ఈ విషయాన్ని ఆమె గుర్తించి ఆ ఫోటోలను తొలగించాలని సంతోష్‌ ఫోన్‌ను తీసుకుని గ్యాలరీ ఓపెన్‌ చేయగా వేలాదిగా యువతులు, మహిళల ఏకాంత చిత్రాలు ఉండడంతో నిశ్చేష్టురాలైంది. ఇందులో తన ఫొటోలే కాకుండా కొందరు మహిళా సహ ఉద్యోగులతో పాటు అనేకమందికి చెందిన 13 వేల నగ్న ఫోటోలు కనిపించాయి.

మార్ఫింగ్‌ చేసి..
ఆదిత్య సంతోష్‌ స్త్రీలోలుడు. నిరంతరం యువతులకు తీయని మాయమాటలు చెప్పి వలలో వేసుకుని ఏకాంతంగా గడిపే వ్యసనం కలిగి ఉన్నాడు. ఆ సమయంలో మొబైల్‌, రహస్య కెమెరా ద్వారా ఫొటోలు, వీడియోలు తీసి మొబైల్‌లో భద్రపరిచేవాడు.అదేవిధంగా ఐదునెలల క్రితం సదరు అమ్మాయితో కామకలాపాలు నిర్వహించి రికార్డు చేశాడు. సంతోష్‌ గత ఐదునెలలుగా ఇదే కంపెనీలో పనిచేస్తున్నాడు.

కొన్ని ఫొటోలను నెట్‌ నుంచి సేకరించి ఆఫీసులోని యువతుల ముఖాలతో మార్ఫింగ్‌, ఎడిట్‌ చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తు తెలిసింది. ఈ ఫొటోల ద్వారా బాధిత యువతులను బ్లాక్‌మెయిల్‌ చేశాడా? అనే దానిపై విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement