ఎంపీ ప్రజ్వల్‌ను అరెస్ట్‌ చేయాలి | Sakshi
Sakshi News home page

ఎంపీ ప్రజ్వల్‌ను అరెస్ట్‌ చేయాలి

Published Mon, May 6 2024 2:05 PM

ఎంపీ ప్రజ్వల్‌ను అరెస్ట్‌ చేయాలి

రాయచూరు రూరల్‌: మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన హాసన ఎంపీ ప్రజ్వల్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని కేపీసీసీ జిల్లా సంచాలకుడు రవి బోసురాజు డిమాండ్‌ చేశారు. ఆదివారం అంబేడ్కర్‌ సర్కిల్లో ఆందోళనలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ అన్ని విషయాలు తెలిసి జేడీఎస్‌తో చేతులు కలిపిందని, ఇది సిగ్గుచేటు విషయమన్నారు. విదేశాలకు పారిపోయిన ప్రజల్వ్‌ను అరెస్ట్‌ చేిసి కఠినంగా శిక్షించాలని అన్నారు.

చిక్కసూగురులో కొవ్వొత్తులతో నిరసన

లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని చిక్కసూగురులో కాంగ్రెస్‌ పార్టీ మహిళా నేతలు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో కార్యకర్తలు శశికళ, జయలక్ష్మీ, శ్రీదేవి, మంజుల, సునీత, రేణుక, పల్లవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement