బళ్లారిటౌన్: తమ డిమాండ్లను పరిష్కరించాలని జిల్లా మద్యం అమ్మకందారులు శుక్రవారం జిల్లాధికారి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లాధికారి ద్వారా సీఎంకు వినతిపత్రాన్ని సమర్పించారు. మద్యం అమ్మకం దారులు జిల్లాధ్యక్షుడు సావుకార్ సతీష్‌బాబు, ప్రధాన కార్యదర్శి బసవ లింగరెడ్డి తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ల సాధన కోసం అన్ని జిల్లాల్లోను సాంకేతిక ధర్నా చేపట్టామన్నారు. చిల్లర మద్యం అమ్మకందారులకు కనీసం 20 శాతం లాభాలు కల్పించాలని, అడిషినల్ ఎకై ్సజ్ ట్యాక్స్‌ను తగ్గించాలని, ఇప్పటికే పలు మద్యం దుకాణాల్లో అమ్మకాలు తగ్గిపోయినందున నష్టాల్లో మద్యం వ్యాపారులు ఉన్నారన్నారు. అయితే ఖాళీ ఉన్న 950 మద్యం దుకాణాలకు టెండర్ ప్రక్రియ ప్రారంభించి ఈ టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉపాధ్యక్షుడు కేపీ రామరెడ్డి, కార్యదర్శి బసవలింగ రెడ్డి, జోనల్ కార్యదర్శి గట్టురాము, సూర్యకుమార్ శెట్టి, పీ.లక్ష్మిరెడ్డి పాల్గొన్నారు.
హుబ్లీ: వివిధ సమస్యల కోసం పరిష్కారం కోసం మద్యం అమ్మకందారులు ధార్వాడ జిల్లాధికారి కార్యాలయం ఎదుట సంఘం తరపున శుక్రవారం ధర్నా చేపట్టారు. ప్రభుత్వం ఆదాయం గడించుకోవడానికి నియమాలకు తిలోదకాలు ఇచ్చిందన్నారు. 4065 మద్యం దుకాణాల వేలంపాట పాడడం దారుణం అన్నారు. అమ్మకందారుల లాభాల శాతాన్ని 20 శాతం మేరకు పెంచాలన్నారు. ఎకై ్సజ్ చట్టం– 2005కు చేసిన సవరణను పునర్ పరిశీలించాలన్నారు. ఎంఎస్‌ఐఎల్ అనుమతుల గురించి న్యాయంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఇష్టానుసారంగా మద్యం ధరలను పెంచరాదని వారు డిమాండ్ చేశారు. సంఘం అధ్యక్షుడు హనుమంతసా నిరంజన, ఉపాధ్యక్షులు మహేష్ శెట్టి, గౌరవ కార్యదర్శి సంబాజీ కలాల్, కోశాధికారి వెంకటేష్ ఆర్ నిరంజన, సహకార్యదర్శి హెచ్‌బీ.గిరిరెడ్డి, రాష్ట్ర సమితి కోశాధ్యక్షుడు, పీఎం మెహరవాడే తదితరులు పాల్గొన్నారు.