
బాలా హోటల్‌పై పోలీసు దాడులు
సాక్షి,బళ్లారి: నగరంలోని పేరుగాంచిన బాలా హోటల్‌లో పోలీసు బృందం తనిఖీ చేసింది. శనివారం సాయంత్రం బాలా హోటల్‌ను జిల్లా ఎస్పీ శోభారాణి, ఏఎస్పీ రవికుమార్, డీఎస్పీ, సీఐలు పరిశీలించి అక్కడ నడుపుతున్న స్పా కేంద్రాన్ని, గదులను పరిశీలించారు. స్పా మసాజ్ పేరుతో వేశ్యావాటిక వంటి అసాంఘిక కార్యకలాపాలు నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మహిళలతో ఇక్కడ స్పా మసాజ్ చేయిస్తుండటం వెలుగు చూసింది. మహిళలను స్పా పేరుతో లైంగికంగా ఉపయోగించుకుంటున్నట్లు బయట పడింది. బళ్లారికి చెందిన ఎం.డీ. మతిల్, ముంబైకి చెందిన మీనజ్ అనే మహిళ ఈ స్పా నడుపుతూ లైంగికంగా మహిళలను ఉపయోగించుకుంటున్నట్లు తేలింది. 5 మందిని పోలీసులు అరెస్ట్ చేసి ముగ్గురు మహిళలను రక్షించారు. ఈ దాడుల్లో గాంధీనగర్ సీఐ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
మసాజ్ పేరుతో వేశ్యావాటిక
తనిఖీలో వెలుగు చూసిన వైనం
ఐదుగురి అరెస్ట్, ముగ్గురు మహిళలకు విముక్తి