
మైలవరం: కుటుంబ కలహాల నేపథ్యాన భార్యను భర్త అతికిరాతంగా హతమార్చిన ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మంగళవారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన పెనుముక్కల మధుమురళి, దుర్గాభవాని(21) భార్యాభర్తలు. వీరికి ఆరేళ్ల వర్షిత్, ఏడాదిన్నర కుమార్తె జెస్సీ ఉన్నారు.
ఏడాది క్రితం వీరు మైలవరం వచ్చి రామకృష్ణ కాలనీలో అద్దెకు ఉంటుండగా మధుమురళి టైల్స్ పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, మధుకి ఇటీవల భార్యపై అనుమానం పెరగడంతో మనస్పర్థలువచ్చాయి. ఈ క్రమంలోనే మంగళవారం మాటామాటా పెరిగి దుర్గాభవాని మెడపై ఆయన కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావం అవుతుండగా ఆమె కేకలు వేస్తూ బయటకు పరుగులు తీస్తూ గేట్ వద్ద కుప్పకూలింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించడంతో పాటు మధుమురళిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment